iDreamPost
android-app
ios-app

MS Dhoni: ధోని రిటైరై 4 ఏళ్లు.. అయినా కోహ్లీ, రోహిత్​ రేంజ్​లో క్రేజ్! ఇదిగో లేటెస్ట్ ప్రూఫ్!

  • Published Jul 22, 2024 | 9:18 PMUpdated Jul 22, 2024 | 9:18 PM

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రిటైరై నాలుగేళ్లకు పైనే కావొస్తోంది. అయినా అతడి క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఇదిగో లేటెస్ట్ ప్రూఫ్.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రిటైరై నాలుగేళ్లకు పైనే కావొస్తోంది. అయినా అతడి క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఇదిగో లేటెస్ట్ ప్రూఫ్.

  • Published Jul 22, 2024 | 9:18 PMUpdated Jul 22, 2024 | 9:18 PM
MS Dhoni: ధోని రిటైరై 4 ఏళ్లు.. అయినా కోహ్లీ, రోహిత్​ రేంజ్​లో క్రేజ్! ఇదిగో లేటెస్ట్ ప్రూఫ్!

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కెరీర్​లో అతడు సాధించని ఘనత లేదు, అందుకోని మైలురాయి లేదు. కెప్టెన్​గా భారత్​కు రెండు ప్రపంచ కప్​లు అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మెన్ ఇన్ బ్లూను విజేతగా నిలిపాడు. టెస్టుల్లో జట్టును నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. అతడి సారథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, శిఖర్ ధవన్ లాంటి ఆటగాళ్లు టీమ్​లో తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. ఆ తర్వాత వీళ్లు వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో విధాలుగా టీమిండియాకు సేవ చేసిన ధోని.. రిటైరై నాలుగేళ్లకు పైనే కావొస్తోంది.

ఆగస్టు 15, 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు ధోని. ఆ తర్వాత నుంచి మళ్లీ అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. ప్లేయర్​గా, కెప్టెన్​గా తన స్థాయిలో రాణించేవాళ్లు, జట్టును సక్సెస్​ఫుల్​గా నడిపించేవాళ్లు రాకపోవడంతో ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ డిలే అవుతూ వస్తోంది. అయితే ప్రొఫెషనల్ క్రికెట్​కు దూరంగా ఉంటున్నా మాహీ క్రేజ్, పాపులారిటీలో ఇసుమంత కూడా మార్పు రాకపోవడం గమనార్హం. ఐపీఎల్ టైమ్​లో అంటే అతడి గురించి అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి వార్తల్లో నిలుస్తాడని అనుకోవచ్చు.. కానీ మెగా లీగ్ లేని టైమ్​లోనూ ధోని హవా నడవడం అంటే స్పెషల్ అనే చెప్పాలి. అది కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లెవల్​లో క్రేజ్ ఉండటం అంటే మామూలు విషయం కాదు.

ధోని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు సరికదా.. ఇంకా ఎంతగానో రెట్టింపైంది. దానికి ఇదే లేటెస్ట్ ప్రూఫ్​. జూన్ నెలకు గానూ ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా ప్రకటించిన టాప్-3 మోస్ట్ పాపులర్ స్పోర్ట్​పర్సన్ ఇన్ ఇండియా లిస్ట్​లో మాహీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్​లో కింగ్ కోహ్లీ టాప్​లో ఉండగా.. ధోని సెకండ్ పొజిషన్​లో నిలిచాడు. భారత జట్టు సారథి రోహిత్​ను మాహీ దాటేశాడు. ఈ జాబితాలో హిట్​మ్యాన్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇది తెలిసిన నెటిజన్స్ ధోని క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతోందని.. అతడి పాపులారిటీకి ఇది మచ్చుతునక అని అంటున్నారు. ఐపీఎల్ సమయంలో అంటే ఓకే గానీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ పీక్​ టైమ్​లో ఉన్నప్పుడు కూడా రోహిత్​ను దాటి కోహ్లీకి పోటీగా ఇస్తూ సెకండ్ పొజిషన్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు. మరి.. ఆర్మాక్స్ లిస్ట్​లో ధోని రెండో స్థానంలో నిలవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి