iDreamPost
android-app
ios-app

Hardik Pandya: ఫిట్​నెస్ కాదు.. హార్దిక్​కు కెప్టెన్సీ దక్కకపోవడానికి కారణం అదే: మాజీ క్రికెటర్

  • Published Jul 24, 2024 | 8:42 PMUpdated Jul 24, 2024 | 8:42 PM

టీమిండియా డాషింగ్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు లంక సిరీస్​కు రెడీ అవుతున్నాడు. టీ20 కెప్టెన్సీ దక్కకపోవడంతో నిరాశగా ఉన్న హార్దిక్.. ఈ సిరీస్​లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియా డాషింగ్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు లంక సిరీస్​కు రెడీ అవుతున్నాడు. టీ20 కెప్టెన్సీ దక్కకపోవడంతో నిరాశగా ఉన్న హార్దిక్.. ఈ సిరీస్​లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

  • Published Jul 24, 2024 | 8:42 PMUpdated Jul 24, 2024 | 8:42 PM
Hardik Pandya: ఫిట్​నెస్ కాదు.. హార్దిక్​కు కెప్టెన్సీ దక్కకపోవడానికి కారణం అదే: మాజీ క్రికెటర్

వరల్డ్ కప్ హీరో, టీమిండియా డాషింగ్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు లంక సిరీస్​కు రెడీ అవుతున్నాడు. పొట్టి కప్పులో బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ అదరగొటిన హార్దిక్.. అదే పెర్ఫార్మెన్స్​ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. మెగాటోర్నీ తర్వాత సెలబ్రేషన్స్​లో బిజీ అయిపోయిన పాండ్యా.. అవి ముగిశాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. రీఫ్రెష్ అయిన అతడు మళ్లీ బరిలోకి దిగి గర్జించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇటు టీ20 టీమ్ కెప్టెన్సీ దక్కకపోవడం, అటు భార్య నటాషా స్టాంకోవిచ్​తో తెగదెంపుల కారణంగా మెంటల్​గా డిస్ట్రబ్ అయ్యాడు. దీన్ని అధిగమించి అతడు ఏ మేరకు రాణిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

టీ20 కెప్టెన్సీ విషయంలో హార్దిక్​కు బీసీసీఐ అన్యాయం చేసిందని కొందరు అంటుంటే.. కాదు, బోర్డు తీసుకున్నది కరెక్ట్ డెసిషనే అని మరికొందరు సమర్థిస్తున్నారు. ఫిట్​నెస్ ఇష్యూస్ కారణంగా చూసి పాండ్యాకు కాదని మరో సీనియర్ సూర్యకుమార్ యాదవ్​కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. అన్ని టీ20 మ్యాచులకు అందుబాటులో ఉండే కెప్టెన్ కావాలనే ఉద్దేశంతో పాండ్యాను కాదని, సూర్య వైపు మొగ్గు చూపామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అయితే హార్దిక్​ను కెప్టెన్సీకి సెలెక్ట్ చేయకపోవడానికి ఫిట్​నెస్ కారణం కాదని అన్నాడు టీమిండియా లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్. వాళ్లు చెప్పడం వల్లే అతడికి ఆ పోస్ట్ దక్కలేదన్నాడు.

డ్రెస్సింగ్ రూమ్​ నుంచి హార్దిక్​కు మద్దతు లభించలేదని, అదే అతడికి మైనస్​గా మారిందని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పాడు. సహచర ఆటగాళ్ల ఫీడ్​బ్యాక్ అనుకూలంగా ఉండకపోవడం పాండ్యా కెప్టెన్సీ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఐపీఎల్​లో అతడు సారథ్యం వహించినప్పుడు వ్యవహరించిన తీరు కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు క్రిష్ శ్రీకాంత్. ఫిట్​నెస్​ వల్లే అతడ్ని కెప్టెన్ చేయలేదనేది నిజం కాదని.. ఎందుకంటే, ఐపీఎల్​ మొత్తం అతడు బౌలింగ్, బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్​లోనూ ప్రతి మ్యాచ్​లో బౌలింగ్ చేస్తూ వచ్చాడని, ఫీల్డింగ్​లో కూడా తన మార్క్ చూపించాడని స్పష్టం చేశాడు. మరి.. హార్దిక్​కు కెప్టెన్సీ దక్కకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి