iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీకి గుర్తుండిపోయేలా RCBని దెబ్బకొడదాం అనుకున్న: తెలుగు క్రికెటర్‌

  • Published Jul 24, 2024 | 6:38 PM Updated Updated Jul 24, 2024 | 6:38 PM

Virat Kohli, Nitish Kumar Reddy: స్టార్‌ క్రికెటర్‌, కింగ్‌ కోహ్లీకి గుర్తుండిపోయేలా.. ఆర్సీబీని దెబ్బ కొడదామని అనుకున్నట్లు తెలుగు క్రికెటర్‌ నితీష్‌కుమార్‌ రెడ్డి వెల్లడించాడు. మరి అతను అలా ఎందుకు అనుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Nitish Kumar Reddy: స్టార్‌ క్రికెటర్‌, కింగ్‌ కోహ్లీకి గుర్తుండిపోయేలా.. ఆర్సీబీని దెబ్బ కొడదామని అనుకున్నట్లు తెలుగు క్రికెటర్‌ నితీష్‌కుమార్‌ రెడ్డి వెల్లడించాడు. మరి అతను అలా ఎందుకు అనుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 24, 2024 | 6:38 PMUpdated Jul 24, 2024 | 6:38 PM
విరాట్‌ కోహ్లీకి గుర్తుండిపోయేలా RCBని దెబ్బకొడదాం అనుకున్న: తెలుగు క్రికెటర్‌

ఐపీఎల్‌ 2024 అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు తేజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. కానీ, దురదృష్టవశాత్తు.. టీమిండియా క్యాప్‌ను అందుకోలేకపోయాడు. అయితే.. తాజాగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. నితీష్‌ కుమార్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2024 విరాట్‌ కోహ్లీకి తన పేరు గుర్తుండిపోయేలా.. ఆర్సీబీకి వ్యతిరేకంగా బాగా ఆడాలని అనుకున్నానని తెలిపాడు.

నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘నాకు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ అంటే చాలా ఇష్టం. నేను వాళ్లిద్దర్ని ఎడ్మైర్‌ చేస్తాను. గత పదేళ్లుగా నేను ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్‌ని. ఐపీఎల్‌ 2023 సందర్భంగా నాకు నా ఐడిల్‌ విరాట్‌ కోహ్లీని కలిసే అవకాశం వచ్చింది. తొలిసారి కలిసినప్పుడు నేను ఆయనతో పెద్ద మాట్లాడలేదు. జస్ట్‌ కోహ్లీతో ఒక హ్యాడ్‌ షేక్‌, ఒక ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాను. అయితే.. ఐపీఎల్‌ 2024 మాత్రం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో బాగా ఆడాలని అనున్నాను. నా బ్యాటింగ్‌ చూసి.. కోహ్లీ నన్ను గుర్తుపెట్టుకోవాలని అనుకున్నాను. కానీ, నాకు ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ రాలేదు.’ అని నితీష్‌కుమార్‌ పేర్కొన్నాడు.

అలాగే ఐపీఎల్‌ 2024లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత.. హార్ధిక్‌ పాండ్యా తనకు మేసేజ్‌ చేసినట్లు నితీష్‌ వెల్లడించాడు. ఫీల్డ్‌లో నేను చూపించే ఇంటెంట్‌ బాగుందని, దాన్ని అలాగే కొనసాగించాలని పాండ్యా సూచించినట్లు తెలిపాడు. పాండ్యా మేసేజ్‌ రావడంతో నేను షాక్‌ అయ్యాను అని అన్నాడు. అయితే.. ఐపీఎల్‌ 2024లో చూపించిన ప్రతిభ ఆధారంగా నితీష్‌ కుమార్‌ రెడ్డిని.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, చివరి నిమిషంలో గాయంతో నితీష్‌ ఆ సిరీస్‌ మిస్‌ అయ్యాడు. అతని స్థానంలో శివమ్‌ దూబే ఎంపికయ్యాడు. మరి నితీష్‌ కుమార్‌, కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.