iDreamPost
android-app
ios-app

హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ బ్యూటీ ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు.. గుర్తుపట్టారా?

  • Published Jan 05, 2024 | 1:31 PM Updated Updated Jan 05, 2024 | 1:31 PM

హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం. ఇక తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఈమె ఓ దిగ్గజ క్రికెటర్ అని మీకు తెలుసా?

హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం. ఇక తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఈమె ఓ దిగ్గజ క్రికెటర్ అని మీకు తెలుసా?

హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ బ్యూటీ ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు.. గుర్తుపట్టారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని హీరోయిన్ అనుకుంటే మీరు పొరపడినట్లే. హీరోయిన్ అందం, గ్లామర్ ఈ అమ్మడి సొంతం. కానీ ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు. ఈ బ్యూటీ టీమిండియాకు చెందిన ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు, ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా? అయితే మీకో క్లూ.. ఆ డాషింగ్ క్రికెటర్ తన బ్యాటింగ్ తో, కెప్టెన్సీతో క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నాడు. ఇతడి సారథ్యంలోనే టీమిండియాలో సమూల మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఆమె ఎవరి కూతురో గెస్ చేశారా? సర్లేండి.. ఆమె ఎవరు? ఆ దిగ్గజ క్రికెటర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం. ఇక తన డ్యాన్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ. ఒకప్పుడు డ్యాన్స్ క్విన్ గా వెలుగొందిన సనా.. ప్రస్తుతం ఆర్థిక రంగంలోకి అడుగుపెట్టింది. ఇంటర్న్ షిప్ తోనే భారీ జీతంతో ఉద్యోగం సాధించి గంగూలీ గారాల పట్టి. కోల్ కత్తాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసిన సనా.. లండన్ లోని యూసీఎల్ లో తన గ్రాడ్యూయేషన్ ను పూర్తి చేసింది. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసింది. ముందు నుంచి మెరిట్ స్టూడెంట్ గా కొనసాగుతూ వస్తున్న దిగ్గజ క్రికెటర్ కూతురు ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్స్ కన్సల్టింగ్ కంపెనీ అయిన PWCలో ఇంటర్న్ షిప్ చేస్తోంది.

అయితే ఇంటర్న్ షిప్ లోనే సనా గట్టిగానే జీతం తీసుకుంటోంది. ఈ కంపెనీలో పనిచేసేవారికి రూ. 30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. ఇదిలా ఉండగా.. సనా గంగూలీ ప్రస్తుతం నెలకు లక్ష రూపాయాల వరకు జీతం అందుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఈమెను చూడగానే గుర్తుపట్టారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by sana Ganguly fc (@sana__ganguly_)

 

View this post on Instagram

 

A post shared by sana Ganguly fc (@sana__ganguly_)