SNP
Dinesh Karthik: కోచ్, కెప్టెన్, ఆటగాళ్ల మధ్య మంచి రిలేషన్ ఉండాలి. ముఖ్యంగా ఓటమి సమయంలో ఆటగాళ్లను మద్దతుగా ఉండాలి. కానీ, ఓ కోచ్ మాత్రం ఓటమి రావడం ఆలస్యం.. ఆ జట్టు కెప్టెన్‌పై దారుణమైన విమర్శలు చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Dinesh Karthik: కోచ్, కెప్టెన్, ఆటగాళ్ల మధ్య మంచి రిలేషన్ ఉండాలి. ముఖ్యంగా ఓటమి సమయంలో ఆటగాళ్లను మద్దతుగా ఉండాలి. కానీ, ఓ కోచ్ మాత్రం ఓటమి రావడం ఆలస్యం.. ఆ జట్టు కెప్టెన్‌పై దారుణమైన విమర్శలు చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా కోచ్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోచ్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధం అవుతున్న డీకే.. ఇలా ఒక కోచ్‌పై షాకింగ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ డీకే ఏ కోచ్ గురించి మాట్లాడాడు? అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఈ నెల 2న ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్‌లో ముంబై-తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత సెమీస్‌కు చేరిన తమిళనాడు జట్టు.. ఓటమితో తీవ్ర నిరాశచెందింది.
అయితే.. ఈ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ సాయి కిషోర్‌ను బాధ్యుడ్ని చేస్తూ.. ఆ జట్టు కోచ్ సులక్షన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌ను మేం ఆట తొలి రోజు ఉదయం 9 గంటలకే ఓడామని, బౌలింగ్ తీసుకోవాల్సిన పిచ్‌పై మా కెప్టెన్ సాయి కిషోర బ్యాటింగ్ తీసుకున్నాడని అదే మా కొంపముంచిందంటూ కులకర్ణి మ్యాచ్ తర్వాత ఓటమికి బాధ్యత మొత్తం కెప్టెన్ సాయి కిషోర్‌దే అన్నట్లు మాట్లాడాడు. అతను మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌ను తొలి రోజు ఫస్ట్ అవర్‌లోనే ఓడిపోయాం. పిచ్ చూసిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, మా కెప్టెన్ సాయి కిషోర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైకి చెందిన వ్యక్తిగా ఆ పిచ్ గురించి, ముంబై టీమ్ గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ, అంతిమంగా కెప్టెన్ బాస్ కాబట్టి.. బ్యాటింగ్ తీసుకోని మ్యాచ్ ఓడిపోయాం’ అంటూ తప్పు మొత్తం కెప్టెన్‌పై నెట్టేశాడు కోచ్ కులకర్ణి.
ఈ వ్యాఖ్యలతో తమిళనాడు క్రికెట్ అభిమానులతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ కోచ్ కులకర్ణిపై విమర్శలు గుప్పించారు. కోచ్ మాట్లాడింది తప్పు అంటూ పేర్కొన్నాడు. జట్టు ఓటమికి కెప్టెన్‌ను పూర్తి బాధ్యడ్ని చేయడం సరికాదని, అయినా సాయి కిషోర్ తన అద్భుతమైన కెప్టెన్సీతో దాదాపు 7 ఏళ్ల తర్వాత తమిళనాడు జట్టును సెమీస్ వరకు చేర్చాడని, ఇలాంటి శుభపరిణామంలో కెప్టెన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని డీకే వెల్లడించాడు. అయినా.. జట్టు గెలుపోటములకు ఒక్క వ్యక్తిని, అందులోనా కెప్టెన్‌ను కార్నర్ చేసి కోచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is soo WRONG
This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it’s a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus
👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs
— DK (@DineshKarthik) March 5, 2024