Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ఈ టోర్నీకి వీడ్కోలు పలికాడు టీమిండియా స్టార్ క్రికెటర్, ఆ టీమ్ కీ ప్లేయర్ దినేశ్ కార్తీక్. అయితే వచ్చే సీజన్లో మాత్రం సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ఈ టోర్నీకి వీడ్కోలు పలికాడు టీమిండియా స్టార్ క్రికెటర్, ఆ టీమ్ కీ ప్లేయర్ దినేశ్ కార్తీక్. అయితే వచ్చే సీజన్లో మాత్రం సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
దినేశ్ కార్తీక్.. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తర్వాత తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన డీకే తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొన్ని మ్యాచ్ ల్లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డీకే.. వచ్చే సీజన్లో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. మెంటర్, బ్యాటింగ్ కోచ్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రాబోయే ఐపీఎల్ సీజన్లో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కు మెంటర్ కమ్ బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో డీకే ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. “మరోసారి ఆర్సీబీ జట్టులో, సరికొత్త పాత్రలో భాగం అవుతున్నందుకు సంతోషం. దినేశ్ కార్తీక్ కు స్వాగతం” అని ఆర్సీబీ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.
కాగా.. 39 ఏళ్ల దినేశ్ కార్తీక్ ఐపీఎల్ ప్రారంభం నుంచి కొనసాగిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే మిస్ అయ్యాడు డీకే. ధోని తర్వాత బెస్ట్ ఫినిషర్ గా డీకే కితాబు అందుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ల లిస్ట్ లో రోహిత్ శర్మతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 257 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన డీకే.. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 145 క్యాచ్ లు, 37 స్టంపింగ్ ఉన్నాయి. మరి డీకేను ఆర్సీబీ మెంటర్ గా, బ్యాటింగ్ కోచ్ గా తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)