ధోని ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన దినేశ్ కార్తీక్.. తప్పు చేశానంటూ..!

MS Dhoni, Dinesh Karthik: లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని విషయంలో తాను ఓ తప్పు చేశానని అన్నాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. మాహీ అభిమానులకు సారీ కూడా చెప్పాడు.

MS Dhoni, Dinesh Karthik: లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని విషయంలో తాను ఓ తప్పు చేశానని అన్నాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. మాహీ అభిమానులకు సారీ కూడా చెప్పాడు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఘనతల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా అతడు ఏమేం సాధించాడో క్రికెట్ లవర్స్ కు తెలిసిందే. వికెట్ల వెనుక అద్భుతమైన కీపింగ్ తో, బ్యాట్ పట్టి పించ్ హిట్టింగ్ చేస్తూ, సారథిగా టీమ్ ను నడిపిస్తూ భారత జట్టుకు ఏళ్ల పాటు అపూర్వ సేవలు అందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2011 వన్డే ప్రపంచ కప్ ను కూడా దేశానికి అందించాడు మాహీ. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ ఒడిలో చేర్చాడు. ఇంతగా సక్సెస్ అయిన ధోనీని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ విస్మరించడం విమర్శలకు దారితీసింది. దీంతో అతడు సారీ చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి తన ఆల్ టైమ్ ఫేవరెట్ టీమిండియా ఎలెవన్ దినేశ్ కార్తీక్ ప్రకటించాడు. ఇందులో 12వ ప్లేయర్ గా హర్భజన్ సింగ్ పేరును జతచేశాడు. కానీ ఆ ఎలెవన్ లో ధోని పేరు మాత్రం లేదు. దీంతో బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా దేశానికి ఇన్ని సేవలు అందించిన మాహీ పేరు ఎందుకు లేదంటూ డీకేను ధోని ఫ్యాన్స్ విమర్శించారు. తాజాగా ఈ వివాదం మీద అతడు రియాక్ట్ అయ్యాడు. తాను ప్రకటించిన టీమ్ లో వికెట్ కీపర్ స్థానాన్నే మర్చిపోయానని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేశానని చాలా మంది పొరబడుతున్నారని చెప్పాడు. కానీ ద్రవిడ్ ను కీపర్ గా భావించి ఎలెవన్ లోకి తీసుకోలేదన్నాడు. ధోని విషయంలో తప్పు జరిగిందని, క్షమించాలని అభిమానుల్ని కోరాడు డీకే.

‘నేను బిగ్ మిస్టేక్ చేశా. అది అనుకోకుండా జరిగింది. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత ఈ విషయం అర్థమైంది. నేను అనౌన్స్ చేసిన 11 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ మిస్ చేశా. ద్రవిడ్ ను ఆ పొజిషన్ కోసం తీసుకున్నానని అందరూ అనుకున్నారు. కానీ అతడ్ని కీపింగ్ కోసం తీసుకోలేదు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన నేను వికెట్ కీపర్ ను సెలెక్ట్ చేయడం మర్చిపోయానంటే ఎవరైనా నమ్ముతారా? ఇది పెద్ద పొరపాటు. ధోని పేరు ఏ ఫార్మాట్ లో అయినా ఉంటుంది. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా అతడి పేరు ఉంటుంది. గ్రేట్ క్రికెటర్స్ లో మాహీ ఒకడు. ఆల్ టైమ్ ఎలెవన్ ను మళ్లీ ప్రకటించాల్సి వస్తే ఒక మార్పు చేస్తా. ధోనీని ఏడో స్థానంలో తీసుకుంటా. అంతేగాక ఏ టీమిండియా ఎలెవన్ అయినా అతడే కెప్టెన్’ అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ధోని విషయంలో తప్పు చేశానంటూ డీకే సారీ చెప్పాడు కాబట్టి ఇకనైనా ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందేమో చూడాలి.

Show comments