Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్‌లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఈ తరుణంలో సెలెక్టర్లు సంచలన ప్రకటన చేశారు.
టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్‌లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఈ తరుణంలో సెలెక్టర్లు సంచలన ప్రకటన చేశారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్‌లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై అన్ని టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. పొట్టి కప్పు నెగ్గిన టీమిండియాతో పాటు ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్‌పై కన్నేశాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో అంతటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీనే. కాబట్టి ఎలాగైనా ఈసారి కప్పు వదలొద్దని అన్నీ పట్టుదలతో ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్‌ను చేజిక్కించుకున్న ఆనందంలో ఉన్న భారత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మీద గురి పెడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకో కప్పుతో కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నారు.
టీమిండియాతో పాటు టాప్ టీమ్ అయిన ఆస్ట్రేలియా కూడా ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్ చేస్తోంది. వన్డే ప్రపంచ కప్-2023ని కైవసం చేసుకున్న ఆసీస్.. 50 ఓవర్ల ఫార్మాట్లో ఛాంపియన్‌గా ఉంది. అయితే రీసెంట్గా జరిగిన పొట్టి కప్పులో సూపర్-8 నుంచే ఇంటిదారి పట్టడంతో ఆ జట్టు తీవ్రంగా విమర్శల పాలైంది. ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో కంగారూల ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గి తమ సత్తా ఏంటో చూపించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ తరుణంలో ఆ దేశ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ సంచలన ప్రకటన చేశాడు. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయమని వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అతడ్ని సెలెక్షన్‌కు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశాడు.
‘మా దృష్టిలో వార్నర్ రిటైర్ అయిపోయాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా ఆడి ఆటకు వీడ్కోలు పలికాడు. తన కెరీర్ విషయంలో అతడు హ్యాపీగా ఉండాలి. పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వార్నర్‌ను ఎంపిక చేసే ఉద్దేశం మాకు లేదు’ అని బెయిలీ చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్ కప్-2023తో 50 ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు వార్నర్. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌తో పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే వెళ్తూ వెళ్తూ అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా మళ్లీ వస్తానంటూ చిన్న హింట్ ఇచ్చాడు. ఇదే విషయంపై తాజాగా సెలెక్టర్ బెయిలీ రియాక్ట్ అయ్యాడు. వార్నర్ కావాలనే అలా జోక్ చేశాడని అన్నాడు. ఆసీస్ క్రికెట్‌కు వార్నర్ అపూర్వ సేవలు అందించాడని మెచ్చుకున్నాడు. మరి.. వార్నర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయమంటూ బెయిలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
8th July – David Warner confirmed his availability for the 2025 Champions Trophy.
15th July – Australian selectors confirmed Warner won’t be considered for Champions Trophy. pic.twitter.com/p23qXHCQdg
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024