SNP
BCCI, Central Health Ministry: గుట్కా, టోబాకో సంబంధిత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
BCCI, Central Health Ministry: గుట్కా, టోబాకో సంబంధిత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
క్రికెట్.. ఆట స్థాయిని దాటేసి వ్యాపారంగా మారిపోయి చాలా కాలం అయిపోయింది. డిమాండ్‌కు తగ్గట్లు అన్ని హంగులు, ఆర్భాటాలు, ఆధునాతన సౌకర్యాలు క్రికెట్‌కు జోడించాలంటే.. కాస్త వ్యాపార విలువలు పాటించక తప్పుదు. అందుకోసం.. వ్యాపార ప్రకటనలు ప్రధాన ఆదాయ వనరు. అది ఆటగాళ్లకైనా, టీమ్ స్పాన్సర్లకైనా, క్రికెట్ బోర్డులకైనా. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ చూసినా.. యాడ్స్ యాడ్స్. ఏ వస్తువును మార్కెట్‌లోకి తెచ్చినా.. దాన్ని ప్రజలకు తెలిసేలా చేయడం, వారితో కొనిపించేలా చేయడమే యాడ్స్ ప్రధాన లక్ష్యం. అందుకోసం చాలా డిఫరెంట్‌గా, ఆకట్టుకునేలా యాడ్స్ షూట్ చేస్తుంటారు. అలాగే ప్రముఖ సినీ స్టార్లతో, క్రికెటర్లతో బ్రాండ్ ఎండార్సింగ్ చేయిస్తుంటాయి పలు కంపెనీలు.
అలా రూపొందించిన యాడ్స్.. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కూడా ప్లే చేస్తూ ఉంటారు. స్టేడియంలో ఉండే పెద్ద పెద్ద స్క్రీన్లపై, హోర్డింగ్స్‌పై పలు రకాల యాడ్స్‌ను డిస్‌ప్లే చేస్తుంటారు. అయితే.. ఇకపై స్టేడియంలో టోబాకో, తంబాకు, గుట్కా వంటి వాటికి సంబంధించిన యాడ్స్‌ను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా బీసీసీఐకి సూచనలు చేసినట్లు సమాచారం. అలాగే ఆ యాడ్స్ చేస్తున్న మాజీ క్రికెటర్లకు కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెళ్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. గుట్కా, టోబాకో లాంటి కంపెనీలు కొన్ని కోట్ల రుపాయాలు బీసీసీఐకి, ఆయా స్టేడియాలను నిర్వహిస్తున్న రాష్ట్ర క్రికెట్ బోర్డులకు ఇస్తంటాయి.
కానీ, ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి ఆదాయం తగ్గపోనుంది. అయితే.. క్రికెట్ మ్యాచ్ చూసే యువతపై ఆ యాడ్స్ ప్రభావం చూపిస్తున్నాయి. అవి తినేలా వారిని ప్రొత్సహించేలా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిని స్టేడియంలో ప్రదర్శించకుండా చూడాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ సూచనలను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటే.. ఇకపై మన దేశంలోని క్రికెట్ స్టేడియాల్లో గుట్కా, టోబాకో లాంటి ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ కనిపించవు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Union Health Minister is planning to ask BCCI & former cricketers to stop showing Tobacco, Surrogate, Gutka ads – even the in cricket stadiums as well. [LiveMint] pic.twitter.com/lM8doOpmA4
— Johns. (@CricCrazyJohns) July 15, 2024