David Warner: రిటైర్మెంట్​పై యూటర్న్ తీసుకున్న వార్నర్.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు!

ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024తో ఇంటర్నేషనల్ క్రికెట్​కు అతడు గుడ్​బై చెప్పేశాడు.

ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024తో ఇంటర్నేషనల్ క్రికెట్​కు అతడు గుడ్​బై చెప్పేశాడు.

ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024తో ఇంటర్నేషనల్ క్రికెట్​కు అతడు గుడ్​బై చెప్పేశాడు. ఈ ఏడాది జనవరిలో వన్డేల నుంచి తప్పుకున్న అతడు.. పొట్టి కప్పుతో టీ20ల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. దీంతో కోట్లాది మంది అతడి అభిమానులు నిరాశకు లోనయ్యారు. క్రికెట్​లో ఒక తరం ముగిసింది అంటూ తమ బాధను వ్యక్తం చేశారు. డాషింగ్ బ్యాటింగ్​తో ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ లవర్స్​ను అలరించాడు వార్నర్. బౌండరీలు, సిక్సులు కొట్టడమే టార్గెట్​గా పెట్టుకొని ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. క్రికెట్​లో కంగారూల పెత్తనం నడవడంలో వార్నర్​ది కూడా కీలక పాత్ర. ఓపెనర్​గా అతడు ఆడిన సూపర్బ్ ఇన్నింగ్స్​ల వల్లే పలు ఐసీసీ టోర్నీల్లో ఆసీస్​ విజేతగా నిలిచింది. అలాంటోడు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ దేశ అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు.

వార్నర్ వెళ్లిపోవడంతో అతడి ప్లేస్​లో నెక్స్ట్ ఎవరు వస్తారు? ఆసీస్ టీమ్​లో డేవిడ్ భాయ్ వారసుడు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. అతడ్ని రీప్లేస్ చేయడం క్రికెట్ ఆస్ట్రేలియాకు తలకు మించిన పనే అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో వార్నర్ తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్​గా మారింది. ఆస్ట్రేలియా తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ కొత్త మెలిక పెట్టాడతను. ఈ మేరకు తన ఇన్​స్టాగ్రామ్​లో అతడో సంచలన పోస్ట్ పెట్టాడు. ఒక ఛాప్టర్ ముగిసిందని అంటూనే ఆసీస్ తరఫున ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఒకవేళ సెలెక్టర్లు ఎంపిక చేస్తే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడతానని తెలిపాడు వార్నర్.

‘ఒక ఛాప్టర్ ముగిసింది. ఇన్నేళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ఓ మర్చిపోలేని అనుభూతి. ఆస్ట్రేలియా నా టీమ్. నేను ఎక్కువ కాలం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడా. ఇక్కడే నా కెరీర్ ఎక్కువగా గడిచింది. ఇది నాకెంతో గర్వకారణం. నా ఆటతో క్రికెట్ లవర్స్​ను ఆకట్టుకున్నానని భావిస్తున్నా. టెస్టు మ్యాచుల్లో ఇతర బ్యాటర్ల కంటే వేగంగా ఆడుతూ అందర్నీ ఎంటర్​టైన్ చేశా’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక్కడితో తన ప్రయాణం పూర్తిగా ఆగిపోలేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకొన్నాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్​లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు వార్నర్. సెలెక్టర్లు ఛాన్స్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో తడాఖా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​లో రాసుకొచ్చాడు. మరి.. వార్నర్ రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments