వీడియో: డేవిడ్ వార్నర్ కెరీర్ లో ఆఖరి టెస్టు.. పాక్ జట్టు సర్ ప్రైజ్!

Pak Surprised David Warner: డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టును ఆడుతున్నాడు. అతనికి ఆఖరి టెస్టును మరింత స్పెషల్ చేస్తూ పాక్ జట్టు వార్నర్ కు బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

Pak Surprised David Warner: డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టును ఆడుతున్నాడు. అతనికి ఆఖరి టెస్టును మరింత స్పెషల్ చేస్తూ పాక్ జట్టు వార్నర్ కు బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

డేవిడ్ వార్నర్.. వరల్డ్ క్రికెట్ లో ఈ పేరుకు ఒక స్థాయి ఉంది. ఒక ఫ్యాన్ బేస్ ఉంది. భాష, ప్రాతం, దేశంతో సంబంధంలేకుండా వార్నర్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క క్రికెట్ గురించే కాకుండా.. అతని వ్యక్తిత్వాన్ని ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా సంప్రదాయ క్రికెట్ లో వార్నర్ కు మంచి రికార్డులు ఉన్నాయి. పొట్టి క్రికెట్ వచ్చి.. సంప్రదాయ టెస్టు క్రికెట్ పై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ లో టెస్టు క్రికెట్ పై మక్కువ పెంచడంలో వార్నర్ కృషి కూడా ఎంతో ఉంది. అలాంటి వార్నర్ తన కెరీర్లో ఇప్పుడు ఆఖరి టెస్టును ఆడుతున్నాడు. ఇప్పుడు కేవలం వార్నర్ మాత్రమే కాదు.. టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. తన ఆఖరి టెస్టు సందర్భంగా పాక్ జట్టు వార్నర్ కు అనుకోని సర్ ప్రైజ్ ఇచ్చింది.

డేవిడ్ వార్నర్ 2011లో తన టెస్టు క్రికెట్ ను ప్రారంభించాడు. దాదాపు 13 ఏళ్లపాటు టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియాకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇన్నేళ్ల పోరాటాలు, రికార్డులు, అద్భుత ఇన్నింగ్సుల తర్వాత డేవిడ్ వార్నర్ తన టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్ లో ఆఖరి టెస్టును పాకిస్తాన్ తో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్ ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ జట్టు డేవిడ్ వార్నర్ కు ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు 313 పరుగలకు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తరఫున ఓపెనర్స్ డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా మైదానంలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో పాక్ జట్టు సభ్యులు మొత్తం మైదానంలో వరుసగా నిల్చుని వార్నర్ కు గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇన్నేళ్లపాటు టెస్టు క్రికెట్ కు వార్నర్ అందించిన సేవలకు గానూ అతడిని అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిన చాటుకున్నారు.

వార్నర్ కూడా పాకిస్థాన్ జట్టు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మైదానంలోకి దూసుకెళ్లాడు. ఈ సన్నివేశం చూసిన ఆస్ట్రేలియా అభిమానులు మాత్రమే కాదు.. టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. టెస్టు క్రికెట్ ఒక అద్భుతమైన ఆటగాడిని కచ్చితంగా మిస్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసేసరికి కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆడింది. ఆ ఒక్క ఓవర్లో ఆసీస్ జట్టు 6 పరుగులు చేసింది. ఫస్ట్ ఓవర్ ఫేస్ చేసిన డేవిడ్ వార్నర్ మొదటి బంతిని ఫోర్ గా బౌండరీకి తరలించాడు. మూడో బంతికి రెండు పరుగులు చేశాడు. మొత్తానికి మొదటి ఓవర్లో 6 పరుగులు సాధించాడు. ఖవాజా ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ చేయలేదు.

డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. న్యూజిలాండ్ జట్టుపై గబ్బా వేదికగా డిసెంబర్ 1, 2011లో స్టార్ట్ చేశాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 112 టెస్టులాడిన డేవిడ్ వార్నర్ 70.29, స్ట్రైక్ రేట్, 44.62 యావరేజ్ తో 8,701 పరుగులు చేశాడు. వాటిలో 36 అర్ధ శతకాలు, 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్ లో వార్నర్ బౌలింగ్ కూడా చేశాడు. 19 ఇన్నింగ్స్ లో 342 బంతులు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంక వార్నర్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 37 ఏళ్ల వయసులోనూ మైదానం మొత్తం వార్నరే కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడ బాల్ ఉంటే అక్కడ వార్నర్ కనిపిస్తూ ఉంటాడు. వ్యక్తిత్వం పరంగానూ వార్నర్ అందరికీ నచ్చుతాడు. తెలుగువాళ్లు అయితే డేవిడ్ వార్నర్ ని అభిమానంగా వార్నర్ మావా అంటూ పిలుచుకుంటారు. మరి.. వార్నర్ తన టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments