iDreamPost
android-app
ios-app

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?

  • Author singhj Updated - 10:37 AM, Fri - 13 October 23
  • Author singhj Updated - 10:37 AM, Fri - 13 October 23
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?

క్రికెట్ అంటే ఎక్కువగా ప్లేయర్ల గురించే అంతా మాట్లాడుకుంటారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది కాబట్టి. అందుకే ఆటగాళ్ల గురించే డిస్కషన్స్ ఉంటాయి. అయితే స్క్రీన్​పై క్రికెటర్లు మాత్రమే కనిపించినా.. వారి వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. ఒక మ్యాచ్ జరుగుతోందంటే దాని కోసం చాలా మంది రాత్రింబవళ్లు కృషి చేయాల్సి ఉంటుంది. ప్లేయర్ల వెనుక ఉండి చూసుకునే టీమ్ మేనేజ్​మెంట్ దగ్గర నుంచి పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్​మెన్, బాల్ బాయ్స్, డ్రెస్సింగ్ రూమ్ సిబ్బంది.. ఇలా ఎంతో మంది కష్టం దీంట్లో ఉంటుంది.

క్రికెటర్లకు సన్మానాలు, సత్కారాలు కామనే. కానీ ఒక మ్యాచ్ జరిగేందుకు ఎంతగానో కష్టపడే గ్రౌండ్ స్టాఫ్​తో పాటు పైన చెప్పుకున్న ఎందరో సామాన్యులు వెలుగులోకి రారు. వాళ్ల సేవలకు అంతగా గుర్తింపు కూడా లభించదు. అలా గుర్తింపులోకి రాని ఓ సామాన్యుడ్ని టీమిండియా సన్మానించింది. వినోద్ కుమార్ (వినోద్ జీ) అనే డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి చెందిన వ్యక్తిని భారత క్రికెట్ జట్టు గౌరవించింది. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్ తర్వాత డీడీసీఏలో పనిచేస్తున్న వినోద్​ జీని డ్రెస్సింగ్ రూమ్​కు రావాల్సిందిగా టీమిండియా మేనేజ్​మెంట్ ఆహ్వానించింది.

డ్రెస్సింగ్ రూమ్​కు వచ్చిన వినోద్ జీకి భారత ప్లేయర్లు అందరూ వెల్​కమ్ చెప్పారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచన మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు కలసి టీమ్ జెర్సీని వినోద్​కు అందించారు. 40 ఏళ్లుగా డ్రెస్సింగ్ రూమ్​ అటెండెంట్​గా అందిస్తున్న సేవలకు గానూ టీమిండియా క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని వినోద్​కు ఇచ్చారు. ఆ తర్వాత ప్లేయర్లు అందరూ ఆయన్ను హగ్ చేసుకొని అభినందించారు. వినోద్​జీ లాంటి సామాన్య ఉద్యోగిని భారత జట్టు సన్మానించడంపై నెట్టింట ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరి.. సామ్యానుడ్ని టీమిండియా సత్కరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. నెదర్లాండ్స్​ కంటే..!