iDreamPost
android-app
ios-app

వీడియో: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పంత్‌, అక్షర్‌ పటేల్‌

  • Published Nov 03, 2023 | 12:58 PM Updated Updated Nov 03, 2023 | 12:58 PM

గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్‌ ప్లేయర్లు రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు..

గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్‌ ప్లేయర్లు రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 12:58 PMUpdated Nov 03, 2023 | 12:58 PM
వీడియో: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పంత్‌, అక్షర్‌ పటేల్‌

ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరు ఎన్‌సీఏలో ఉన్న వీరిద్దరూ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పండితులు వీరికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక పంత్‌, అక్షర్‌ పటేళ్లను చూసిన అభిమానులు వారితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

టీఇండియా స్టార్‌ ప్లేయర్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మోకాలి లిగమెంట్లు డ్యామేజ్‌ కావడంతో.. ఆపరేషన్‌ చేశారు. ప్రమాదం కారణంగా పంత్‌ ఐపీఎల్‌, ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత కోలుకున్న పంత్‌.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. పిట్‌నెస్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని భావించిన మరో స్టార్‌ ప్లేయర్‌ అక్షర్‌ పటేల్‌ గాయ కారణంగా ఏకంగా టోర్ని మొత్తానికి దూరయ్యాడు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ప్రపంచకప్ నాటికి కోలుకుంటాడని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.