ప్రపంచ కప్ ఫైనల్లో భారత టీమ్ గనుక అలా చేసుంటే కప్పు గెలిచేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. అసలు ఆమె తీసుకొస్తున్న కొత్త వాదన ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ ఫైనల్లో భారత టీమ్ గనుక అలా చేసుంటే కప్పు గెలిచేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. అసలు ఆమె తీసుకొస్తున్న కొత్త వాదన ఏంటో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి చేసిన గాయాన్ని టీమిండియా ప్లేయర్స్, ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. కప్పు కొట్టాలన్న భారత ఆశలపై నీళ్లు చల్లిన ఆసీస్.. మన జట్టు అభిమానులకు సంతోషాన్ని దూరం చేసింది. ఆ ఓటమి బాధ నుంచి కోలుకునే లోపే టీమిండియా మరో సిరీస్‌ను మొదలుపెట్టేసింది. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఇప్పటి నుంచే దానికి ప్రిపరేషన్స్‌ను స్టార్ట్ చేసేసింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌ను ప్లాన్ చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య వైజాగ్ వేదికగా గురువారం ఫస్ట్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భారత్ నెగ్గడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. కాగా, మెగా టోర్నీ ఫైనల్లో ఆసీస్ చేతిలో రోహిత్ సేన ఓటమిపై కొందరు ప్రముఖ పొలిటీషన్స్ రియాక్డ్ అవుతున్నారు. ఈ విషయంలోకి కేంద్రంలోని అధికార బీజేపీని లాగుతున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ టైమ్‌లో వేసుకునే జెర్సీలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత ప్లేయర్లు వేసుకునే జెర్సీలు కాషాయ రంగులో ఉన్నాయని.. బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఇలా జరిగిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశం మొత్తాన్ని బీజేపీ కాషాయమయం చేయాలని అనుకుంటోందని.. అందులో భాగంగానే టీమిండియా ప్లేయర్లతో ఆ జెర్సీలు వేయించారని విమర్శించారు దీదీ. అలాంటి ఆమె ఇప్పుడు మరో కొత్త వాదనకు తెరలేపారు. వరల్డ్ కప్ ఫైనల్‌ను కోల్‌కతా లేదా ముంబైలో నిర్వహిస్తే భారత టీమ్ గెలిచేదని మమత అన్నారు. ఈడెన్ గార్డెన్స్ లేదా వాంఖడే స్టేడియంలో మ్యాచ్ పెడితే తప్పకుండా టీమిండియానే నెగ్గేదన్నారు. టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. అయితే మన ఆటగాళ్లను చూసి తాను గర్వపడుతున్నానని దీదీ చెప్పుకొచ్చారు.
మమతా బెనర్జీనే కాదు మరికొంత మంది పాపులర్ లీడర్స్ కూడా టీమిండియా ఓటమిపై కామెంట్స్ చేయడం గమనార్హం. రీసెంట్గా రాజస్థాన్‌లో జరిగిన ఎలక్షన్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఆయన ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో మన జట్టే గెలిచేదని.. కానీ పనౌటి (ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి) టీమ్‌ను ఓడిపోయేలా చేశారన్నారు. అయితే రాహుల్ కామెంట్స్ మీద బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్‌కు కూడా కంప్లయింట్ చేసింది. ఈ వివాదం మీద స్పందించిన ఎన్నికల సంఘం.. నవంబర్ 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
మమతా బెనర్జీ, రాహుల్ గాంధీనే కాదు.. ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా టీమిండియా ఓటమిపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ గనుక గుజరాత్లో కాకుండా యూపీలోని లక్నోలో జరిగే ఉంటే భారత జట్టుకు ఎంతో మంది ఆశీస్సులు లభించి ఉండేవన్నారు. ఇక్కడైతే రోహిత్ సేనకు విష్ణువు, అటల్ బిహారీ వాజ్‌పేయి బ్లెస్సింగ్ దొరికేవని తెలిపారు. భారత టీమ్ ఓటమిని రాజకీయ నేతలు బీజేపీపై విమర్శలు చేసేందుకు వాడుతుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమిపై వివాదాలు రేపడం మాని.. టీమ్‌కు సపోర్ట్‌గా ఉండాలని అంటున్నారు. మరి.. టీమిండియా ఓటమిపై దీదీ సహా ఇతర నేతలు చేస్తున్న వాదనల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆస్పత్రి బెడ్ మీద రషీద్ ఖాన్.. ఆఫ్ఘాన్ స్టార్‌కు ఏమైంది?
West Bengal Chief Minister Mamata Banerjee on ICC Cricket World Cup 2023 Final 👀
📷: ICC#CWC23 #ICCCricketWorldCup #ICCCricketWorldCup2023Final #CricketWorldCup2023 #TeamIndia #IndianCricketTeam #Mumbai #Kolkata #Ahmedabad pic.twitter.com/Xe7ddX2eMw
— SportsTiger (@The_SportsTiger) November 23, 2023