iDreamPost

IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా-పాక్ మ్యాచ్! ఎప్పుడంటే?

ప్రపంచ క్రికెట్ లో దాయాదుల సమరం జరగుతుందంటే.. పనులన్నీ మానుకుని టీవీలకు అతుక్కుంటారు సగటు క్రికెట్ అభిమానులు. ఇక అన్నీ కుదిరితే.. ఇండియా-పాక్ మధ్య మరోసారి పోరును ప్రేక్షకులు చూడొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో దాయాదుల సమరం జరగుతుందంటే.. పనులన్నీ మానుకుని టీవీలకు అతుక్కుంటారు సగటు క్రికెట్ అభిమానులు. ఇక అన్నీ కుదిరితే.. ఇండియా-పాక్ మధ్య మరోసారి పోరును ప్రేక్షకులు చూడొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా-పాక్ మ్యాచ్! ఎప్పుడంటే?

ప్రపంచ క్రికెట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది లీగ్ మ్యాచ్ అయినా సరే.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాగా భావిస్తారు అభిమానులు. అయితే ఇది రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులకు కూడా ఈ మ్యాచ్ పై ఎంతో ఆసక్తి ఉంటుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ లో ఢీకొన్న ఇరు జట్లు.. మరోసారి తలపడేందుకు షెడ్యూల్ రెడీ అయ్యింది. లాహోర్ వేదికగా ఇండియా-పాక్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో ఇండియా-పాక్ జట్లు తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 6 పరుగుల స్వల్ప తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది భారత్. ఇక మళ్లీ దాయాదుల సమరం ఎప్పుడు జరుగుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే? పాక్ తో మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ.. అదోరకమైన క్రేజ్. ఇక మరోసారి దాయాదుల సమరానికి షెడ్యూల్ సిద్దం అయ్యినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా తలపడనున్నాయి. అయితే ఇది ఇంకా ఫిక్స్ కాలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. కాగా.. ఈ టోర్నీ కోసం ఐసీసీ విండో కోసం ప్రయత్నిస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను సిద్ధం చేసి.. ఐసీసీతో పాటుగా బీసీసీఐకి పంపించింది పాక్ బోర్డ్. కానీ బీసీసీఐ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం. కాగా.. పాక్ సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్ టీమ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లో జరిగే ఈ టోర్నీకి భారత జట్టు వస్తుందా? రాదా? అన్నది తేలకముందే పాక్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి