iDreamPost
android-app
ios-app

బుమ్రా అరుదైన ఘనత.. షేన్ వార్న్-అండర్సన్​కే సాధ్యం కాలేదు!

IND Vs SA, 2nd Test: దక్షిణాఫ్రికాతో గురువారం జరుగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. షేన్ వార్న్ మరియు జేమ్స్ అండర్సన్‌లకు సాధ్యం కానీ దాన్ని సాధించాడు.

IND Vs SA, 2nd Test: దక్షిణాఫ్రికాతో గురువారం జరుగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. షేన్ వార్న్ మరియు జేమ్స్ అండర్సన్‌లకు సాధ్యం కానీ దాన్ని సాధించాడు.

బుమ్రా అరుదైన ఘనత.. షేన్ వార్న్-అండర్సన్​కే సాధ్యం కాలేదు!

సౌతాఫ్రికా గడ్డపై భారత్, సఫారీల మధ్య టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియాను ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో టీమిండియా సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ బౌలర్లు విజృంభించడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు తేలిపోయారు. భారత పేసు గుర్రాలు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో సఫారీల టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టీమిండియా సమిష్టి కృషితో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అయితే రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ ప్లేయర్ అండర్సన్ కు సాధ్యం కానిది బుమ్రా సాధించాడు.

దక్షిణాఫ్రికాతో గురువారం జరుగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా న్యూలాండ్స్‌లో విజిటింగ్ బౌలర్‌గా దివంగత షేన్ వార్న్ మరియు జేమ్స్ అండర్సన్‌లను అధిగమించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా 6/61తో చెలరేగాడు. సౌతాఫ్రికా గడ్డపై న్యూలాండ్స్‌ పిచ్‌(కేప్‌టౌన్‌) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత ఏకైక బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రెండో స్థానంలో బుమ్రా కొనసాగుతున్నారు. బుమ్రా ప్రస్తుతం కేప్ టౌన్ లో 18 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (17) మూడో స్థానంలో, ఇంగ్లండ్ ఆటగాడు అండర్సన్ (16) నాలుగో స్థానంలో, ఇంగ్లిష్ మాజీ బౌలర్ కోలిన్ బ్లైత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

రెండవ టెస్టు మొదటి రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్న బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ముందు రోజు ట్రిస్టన్‌ స్టబ్స్‌ రూపంలో వికెట్‌ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్‌)నే డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ను అవుట్‌ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేశవ్‌ మహరాజ్‌ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్‌ అందుకున్నాడు.

ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్‌ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్‌ చేరింది. ఈ ఇన్నింగ్స్‌లో తన ఆరు వికెట్లతో, దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. అనిల్ కుంబ్లే (45), శ్రీనాథ్ (43)లతో పోలిస్తే బుమ్రా ప్రస్తుతం 38 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ (35), జహీర్ ఖాన్ (30) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల కంటే తక్కువ వ్యవధిలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికవ్వగా, మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.