iDreamPost
android-app
ios-app

భువనేశ్వర్ కుమార్ విజృంభణ.. ఏకంగా 8 వికెట్లతో వణికించాడు!

రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. ఉత్తర ప్రదేశ్- బెంగాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. ఉత్తర ప్రదేశ్- బెంగాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

భువనేశ్వర్ కుమార్ విజృంభణ.. ఏకంగా 8 వికెట్లతో వణికించాడు!

టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీడియం పాస్ట్ బౌలర్ అయిన భువీ రంజీ ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కొంత కాలం నుంచి టీమిండియాలో చోటు కోల్పోయిన భువీ తన సత్తా ఏంటో రంజీ ట్రోఫీలో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో తన సత్తా ఏంటో చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థలకు చెమటలు పట్టిస్తూ వణికించాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టిన భువీ సంచలనం సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్ కు రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్ వేదికైంది.

రంజీ ట్రోఫీలో భాగంగా గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా బెంగాల్- ఉత్తర ప్రదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 2023-24 రంజీ ట్రోఫీలో భువనేశ్వర్ ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఉత్తర ప్రదేశ్ కు ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. బెంగాల్ బౌలర్ల ధాటికి ఉత్తరప్రదేశ్ కేవలం 60 పరుగులకే కుప్పకూలింది. ఇక ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన బెంగాల్ కు భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించాడు.

కీలకమైన వికెట్లను పడగొడుతూ బెంగాల్ నడ్డీ విరిచాడు. ఈ మ్యాచ్ లో భూవీ 22 ఓవర్లలో 41 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న భువనేశ్వర్ 6 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చి తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌తో ఉత్తరప్రదేశ్‌.. బెంగాల్‌ను 188 పరుగులకు ఆలౌట్‌ చేసింది. భువీ 8 వికెట్లు తీయగా రెండు వికెట్లు యశ్ దయాల్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌట్ అయిన బెంగాల్ 128 పరుగుల ఆధిక్యం సాధించింది.