Nidhan
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు.
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు.
Nidhan
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న అతడు.. 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 బౌండరీలతో పాటు ఏకంగా 5 భారీ సిక్సులు ఉన్నాయి. అతడు కొట్టిన ఓ షాట్‌కు బాల్ వెళ్లి స్టేడియం అవతల చెట్ల పొదల్లో పడింది. దీన్ని బట్టే ఈ పించ్ హిట్టర్ ఇన్నింగ్స్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 218 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జింబాబ్వే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు రింకూ. తొలి మ్యాచ్‌లో ఓటమి, తాను కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో కోపంతో ఉన్న అతడు.. దాన్ని అపోజిషన్ బౌలర్లపై చూపించాడు.
రింకూకు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్) కూడా రెచ్చిపోవడంతో భారత్ 234 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది. ఇక, ఈ మ్యాచ్‌తో రింకూ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ల సరసన చేరాడు. టీ20 క్రికెట్లో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయ బ్యాటర్లలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు రింకూ. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (193 బంతుల్లో 32 సిక్సులు) ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడి తర్వాత స్థానాల్లో వరుసగా కోహ్లీ (158 బంతుల్లో 24 సిక్సులు), ధోని (258 బంతుల్లో 19 సిక్సులు) ఉన్నారు. ఇందులో రింకూ (48 బంతుల్లో 17 సిక్సులు) నాలుగో స్థానంలో నిలిచాడు.
చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయుల జాబితాలో టాప్‌లో ఉన్న హార్దిక్ 32 సిక్సులు కొట్టేందుకు 193 బంతులు తీసుకున్నాడు. కానీ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న రింకూ 48 బంతుల్లో 17 సిక్సర్లు బాదేశాడు. ఇంకో 8 సిక్సులు కొడితే కోహ్లీని అతడు అధిగమిస్తాడు. అతడి ఊపు చూస్తుంటే విరాట్, హార్దిక్‌తో పాటు ఈ లిస్ట్‌లో ముందంజలో ఉన్న ఇతర టీమ్ బ్యాటర్స్‌ను కూడా ఈజీగా దాటేస్తాడని మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో కోహ్లీ, ధోని లాంటి గ్రేట్ ప్లేయర్స్ సరసన చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదని.. ఇది రింకూ ప్రతిభకు నిదర్శనమని చెబుతున్నారు. అతడు ఇదే జోరును కొనసాగించాలని.. ఈ పించ్ హిట్టర్‌ను ఆపడం ఎవరి వల్లా కాదని నమ్మకంగా చెబుతున్నారు. మరి.. కోహ్లీ, హార్దిక్‌ను దాటి రింకూ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Most sixes for India in the last 2 overs in T20is:
Hardik Pandya – 32 (193 balls).
Virat Kohli – 24 (158 balls).
MS Dhoni – 19 (258 balls).
Rinku Singh – 17 (48 balls)*.– Rinku already in the list of greats! pic.twitter.com/p0akM4jddJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2024