iDreamPost
android-app
ios-app

Ben Stokes: ముంబై ఇండియన్స్​లోకి స్టోక్స్.. ఇంగ్లండ్ కెప్టెన్​కు కళ్లు చెదిరే ధర!

  • Published Jul 20, 2024 | 6:02 PM Updated Updated Jul 20, 2024 | 6:02 PM

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సత్తా ఏంటో తెలిసిందే. గ్రౌండ్​లోకి దిగితే అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ దుమ్ము దులపడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సత్తా ఏంటో తెలిసిందే. గ్రౌండ్​లోకి దిగితే అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ దుమ్ము దులపడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.

  • Published Jul 20, 2024 | 6:02 PMUpdated Jul 20, 2024 | 6:02 PM
Ben Stokes: ముంబై ఇండియన్స్​లోకి స్టోక్స్.. ఇంగ్లండ్ కెప్టెన్​కు కళ్లు చెదిరే ధర!

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సత్తా ఏంటో తెలిసిందే. గ్రౌండ్​లోకి దిగితే అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ దుమ్ము దులపడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఫెంటాస్టిక్ ఫీల్డింగ్​తోనూ జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇలా పేస్ బౌలింగ్ వేస్తూ, బ్యాటింగ్ చేస్తూ, ఫీల్డింగ్ పరంగానూ టీమ్ సక్సెస్​లో భాగమయ్యే ఆటగాళ్లు చాలా అరుదు. అందుకే ఈ తరం ఆల్​రౌండర్స్​లో మేటిగా పేరు తెచ్చుకున్నాడు స్టోక్స్. ఇన్ని రకాలుగా సేవలు అందించే అతడికి ఇంటర్నేషనల్ క్రికెట్​లోనే గాక లీగ్ క్రికెట్​లోనూ ఫుల్ డిమాండ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా పలు ఇతర లీగ్స్​లో స్టోక్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అతడిపై మరోమారు కనకవర్షం కురిసింది.

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించే ఎస్​ఏ టీ20 లీగ్​లో బెన్ స్టోక్స్ భాగం కానున్నాడు. అతడు ముంబై ఇండియన్స్ కేప్​టౌన్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగడం కన్ఫర్మ్ అయింది. రూ.8.5 కోట్ల భారీ ధరకు స్టోక్స్​తో ఆ టీమ్ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​కు దూరంగా ఉంటున్న స్టోక్స్.. ప్రస్తుతం వెస్టిండీస్​తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్​లో ఆడుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్​పై ఫోకస్ చేసే ఉద్దేశంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​కు కూడా దూరంగానే ఉన్నాడు. లాస్ట్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్​కు ఆడిన ఈ స్టార్ ఆల్​రౌండర్.. ఈ సంవత్సరం మినీ ఆక్షన్​కు ముందు తన డెసిషన్​ను సీఎస్​కే మేనేజ్​మెంట్​కు తెలియజేశాడు. దీంతో ఆ ఫ్రాంచైజీ అతడ్ని రిటైన్ చేసుకోలేదు.

గత కొన్నాళ్లుగా పొట్టి క్రికెట్​కు దూరంగా ఉంటూ వస్తున్న స్టోక్స్ చేరికతో ఎంఐ కేప్​టౌన్ ఫ్రాంచైజీ మరింత పటిష్టంగా మారనుంది. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, కగిసో రబాడ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్​కు తోడు స్టోక్స్ కూడా రావడంతో ముంబై టీమ్ ఫుల్ స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. అయితే గత రెండు సీజన్లుగా అంతగా ఆకట్టుకోని ఈ జట్టు రాతను స్టోక్స్ మారుస్తాడేమో చూడాలి. ఇక, ఎస్​ఏ 20 లీగ్​లో ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ ఆడటం కూడా ఖాయంగా కనిపిస్తోంది. పర్ల్ రాయల్స్​తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్​తో ఆడిన రూట్.. తాజాగా పర్ల్ రాయల్స్​తో అగ్రిమెంట్ చేసుకున్నాడని బ్రిటీష్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే అతడు ఎంత ధరకు అమ్ముడుపోయాడనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరి.. స్టోక్స్, రూట్​ను ఎస్​ఏ20 లీగ్​లో చూసేందుకు మీరెంత ఆతృతగా ఉన్నారో కామెంట్ చేయండి.