iDreamPost
android-app
ios-app

టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌ లిస్ట్‌ ఫైనల్‌? అధికారిక ప్రకటనే తరువాయి

  • Published Jul 20, 2024 | 4:22 PM Updated Updated Jul 20, 2024 | 4:22 PM

Coaching Staff, BCCI, Gautam Gambhir: శ్రీలంకతో సిరీస్‌ నుంచి గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఛార్జ్‌ తీసుకోనున్నాడు. అయితే.. అతనితో పాటు టీమిండియా కోసం పనిచేసే కోచింగ్‌ స్టాఫ్‌ లిస్ట్‌ కూడా ఫైనల్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

Coaching Staff, BCCI, Gautam Gambhir: శ్రీలంకతో సిరీస్‌ నుంచి గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఛార్జ్‌ తీసుకోనున్నాడు. అయితే.. అతనితో పాటు టీమిండియా కోసం పనిచేసే కోచింగ్‌ స్టాఫ్‌ లిస్ట్‌ కూడా ఫైనల్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లిస్ట్‌లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 20, 2024 | 4:22 PMUpdated Jul 20, 2024 | 4:22 PM
టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌ లిస్ట్‌ ఫైనల్‌? అధికారిక ప్రకటనే తరువాయి

టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరును ప్రకటించిన తర్వాత.. మిగిలిన కోచింగ్‌ స్టాఫ్‌ వివరాలను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. గంభీర్‌ ఇష్ట ప్రకారం తీసుకోవాలా? లేక ఒకరిద్దరి విషయంలో మార్పులు చేర్పులు చేయాలా అనే విషయంలో బీసీసీఐ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఫైనల్‌గా గౌతమ్‌ గంభీర్‌, బీసీసీఐ పెద్దల మధ్య తీవ్ర చర్చల మధ్య గంభీర్‌ అండ్‌ కో టీమ్‌ సెట్‌ అయినట్లు తెలుస్తోంది. గంభీర్‌తో పాటు రాబోయే మూడేళ్ల పాటు టీమిండియాతో కలిసి ట్రావెట్‌ చేసే కోచింగ్‌ స్టాఫ్‌ను బీసీసీఐ ఫైనల్‌ చేసినట్లు సమాచారం.

గంభీర్‌ హెడ్‌ కోచ్‌ కాగా.. అసిస్టెంట్‌ కోచ్‌లుగా అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ టెన్‌ డస్కటే, ఫీల్డింగ్‌ కోచ్‌గా టీ దిలీప్‌, బౌలింగ్‌ కోచ్‌గా మోర్ని మోర్కెల్‌లను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్‌ నాయర్‌ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. కేకేఆర్‌కు గంభీర్‌ మెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నాయర్‌తో గంభీర్‌కు మంచి బాండింగ్‌ ఏర్పడింది. అదే బాండింగ్‌తో టీమిండియాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు పనిచేయాలని భావించి అతన్ని కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకున్నట్లు సమాచారం.

అలాగే ర్యాన్‌ టెన్‌ డస్కటే కూడా కేకేఆర్‌ కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గంభీర్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున ఆడాడు కూడా. ఇక టీ దిలీప్‌, రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అతని పనితనం బాగుండటంతో అతన్నే గంభీర్‌ అండర్‌లో కూడా కొనసాగించాలని బీసీసీఐ భావించినట్లు సమాచారం. ఇక బౌలింగ్‌ కోచ్‌గా మోర్ని మోర్కెల్‌ను తీసుకోవాలని గంభీర్‌ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో గంభీర్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటర్‌గా వ్యవహరించిన సమయంలో మోర్కెల్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అందుకే అతన్ని ఇప్పుడు టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా తీసుకుంటే.. భారత యువ పేసర్లను మంచిగా ట్రైన్‌ చేయొచ్చని గంభీర్‌ భావిస్తున్నాడు. మొత్తంగా గంభీర్‌ అండ్‌ కో లిస్ట్‌ను బీసీసీఐ ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఈ లిస్ట్‌ను రేపో మాపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీలంక టూర్‌తోనే వీళ్లంతా తమ తమ బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ఈ కోచింగ్‌ స్టాఫ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.