Nidhan
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భారత క్రికెట్ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. ద్రవిడ్‌తో పాటు ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌కూ ఓ టార్గెట్ ఇచ్చింది బీసీసీఐ.
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భారత క్రికెట్ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. ద్రవిడ్‌తో పాటు ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌కూ ఓ టార్గెట్ ఇచ్చింది బీసీసీఐ.
Nidhan
ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే. మండు వేసవిలో మరింత హీటెక్కించేందుకు క్యాష్ రిచ్ లీగ్ వచ్చేస్తోంది. ధనాధన్ క్రికెట్‌తో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరో మూడ్రోజుల్లో మెగా లీగ్ మొదలుకానుంది. లీగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అటు అన్ని ఫ్రాంచైజీల ప్లేయర్లు ప్రాక్టీస్‌లో బిజీ అయిపోయారు. ఈ తరుణంలో భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అందరూ ఐపీఎల్ హడావుడిలో ఉండగా.. బీసీసీఐ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమావేశమైందని తెలుస్తోంది.
ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్‌కు బీసీసీఐ అదనపు బాధ్యతలు అప్పజెప్పిందట. వీళ్ల ముగ్గురికీ బోర్డు కొత్త టార్గెట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్లో భారీ మార్పులు తీసుకురావాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని వినికిడి. దేశవాళీ క్రికెట్లో తీసుకురావాల్సిన మార్పుల గురించి బోర్డుకు అవసరమైన సలహాలు, సూచనలను ఈ కమిటీ ఇవ్వనుందని సమాచారం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను మరింత మెరుగుపర్చడం, భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లను సానబెట్టడం, ఫిట్నెస్ నుంచి క్రమశిక్షణ వరకు చాలా విషయాల్లో ఈ కమిటీ సూచనలు చేయనుందట.
ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్ తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల్లో ఉంటూనే ఆ కమిటీలో భాగం కానున్నారని తెలుస్తోంది. బీసీసీఐకి సలహాలు, సూచనలను ఇస్తూనే డొమెస్టిక్ క్రికెట్లో నిరంతరం జరిగే మార్పులను మానిటరింగ్ చేస్తూ ఉండాలట. రంజీ ట్రోఫీ లాంటి పలు దేశవాళీ టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పలు చోట్ల త్వరగా చీకటి పడటం, ముఖ్యంగా ఆ సీజన్లో నార్త్ ఇండియాలో బ్యాడ్ వెదర్ వల్ల ఇబ్బందులు నెలకొంటున్నాయి. డిసెంబర్-జనవరి విండోలో టోర్నీ ఉండటంతో చాలా మ్యాచులు తుడిచిపెట్టుకుపోతున్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉన్న పలు సమస్యలకు పరిష్కారాలు వెతకడం, సూచనలు ఇవ్వడం ఈ కమిటీ బాధ్యతలు అని క్రికెట్ వర్గాల సమాచారం. ఈ కమిటీతో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిపి ద్విసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూకు బోర్డు నుంచి అసోసియేట్ మెంబర్షిప్ ఇవ్వాలా? వద్దా? అనేది ఈ కమిటీ తేల్చనుందట. మరి.. ద్రవిడ్, లక్ష్మణ్‌కు బీసీసీఐ నయా టార్గెట్ సెట్ చేయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నారు! వాడిని ఆపే మగాడు ఎవరు?
BCCI forms a 3-member committee to suggest ways to improve domestic cricket. [Gaurav Gupta from TOI]
– Committee includes Rahul Dravid, Ajit Agarkar & VVS Laxman. pic.twitter.com/04PG1fiur3
— Johns. (@CricCrazyJohns) March 19, 2024