iDreamPost

IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నాయి! వాడిని ఆపే మగాడు ఎవరు?

  • Published Mar 19, 2024 | 2:58 PMUpdated Mar 20, 2024 | 2:48 PM

Glenn Maxwell, IPL 2024: ఐపీఎల్‌ కొత్త సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో అన్ని టీమ్స్‌ ఒక్క ఆటగాడిని చూసి భయపడుతున్నాయి. ఆ ఒక్కడిని ఆపితే చాలు విజయం తమదే అనుకుంటున్నాయి. మరి ఆ ఒక్కడు ఎవడో ఇప్పుడు చూద్దాం..

Glenn Maxwell, IPL 2024: ఐపీఎల్‌ కొత్త సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో అన్ని టీమ్స్‌ ఒక్క ఆటగాడిని చూసి భయపడుతున్నాయి. ఆ ఒక్కడిని ఆపితే చాలు విజయం తమదే అనుకుంటున్నాయి. మరి ఆ ఒక్కడు ఎవడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 19, 2024 | 2:58 PMUpdated Mar 20, 2024 | 2:48 PM
IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నాయి! వాడిని ఆపే మగాడు ఎవరు?

ఐపీఎల్‌ 17వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నికి తెరలేవనుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ కోసం వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆరోసారి కప్పు కొట్టాలని భావిస్తోంది. ఒక్కసారి కూడా కప్పు గెలవని.. ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్‌, లక్నో జట్లు కూడా తొలి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. మరోవైపు ముంబై, రాజస్థాన్‌, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌.. తమ టైటిల్స్‌ నంబర్‌ను పెంచుకోవాలని బరిలోకి దిగుతున్నాయి. ఇలా ప్రతి జట్టు ఒక ఒక పర్టిక్లర్‌ టార్గెట్‌తో, పక్కా ప్రణాళికతో రంగంలోకి దూకుతున్నాయి. అయితే.. మొత్తం 10 జట్లలో 9 టీమ్స్‌ మాత్రం.. ఓ ఆటగాడికే భయపడుతున్నాయి. అతనికోసం స్పెషల్‌ స్కెచ్‌లతో బరిలోకి దిగుతున్నాయి. ఆ ఆటగాడు ఎవరు? ఎందుకు అంతలా మిగతా టీమ్స్‌ని భయపెడుతున్నాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌లోని పది టీమ్స్‌లో చెన్నై, ముంబై, ఆర్సీబీ, కేకేఆర్‌లను పెద్ద టీమ్స్‌గా భావిస్తారు. ఆ జట్లు సాధించే విజయాలు కూడా అలాగే ఉంటాయి. చెన్నైతో మ్యాచ్‌ అంటే కొన్ని టీమ్స్‌ ధోని కోసం, మరికొన్ని టీమ్స్‌ జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌ కోసమో స్పెషల్‌ ప్లాన్‌తో బరిలోకి దిగుతాయి. అలాగే ముంబైతో మ్యాచ్‌ ఆడితే.. కొన్ని టీమ్స్‌కు రోహిత్‌, మరికొన్ని టీమ్స్‌కు సూర్యకుమార్‌ టార్గెట్‌గా ఉంటారు. కానీ, ఆర్సీబీతో మ్యాచ్‌ అంటే అందరికి ఉండే కామన్‌ టార్గెట్‌ విరాట్‌ కోహ్లీ అని చాలా మందికి తెలిసిందే. అయితే.. అది గత సీజన్‌ వరకే. కానీ, ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీతో మ్యాచ్‌ అంటే.. అన్ని టీమ్స్‌ టార్గెట్‌ ఒకే ఒక్కడు.. అతనే మ్యాక్స్‌వెల్‌. గత కొంత కాలంగా అతను సృష్టిస్తున్న విధ్వంసాన్ని గమనిస్తున్న ఆల్‌ ఐపీఎల్‌ టీమ్స్‌.. అతని కోసం ప్రత్యేక స్కెచ్‌తో బరిలోకి దిగాల్సిందే అని ఫిక్స్‌ అయిపోయాయి.

IPL teams scared of maxwell

మ్యాక్సీని జాగ్రత్తగా ఒక వజ్రాయుధంలా వాడుకోవాలని ఆర్సీబీ భావిస్తుంటే.. అతని దెబ్బ నుంచి తప్పించుకోవాలని మిగిలిన టీమ్స్‌ రకరకాల ప్లాన్లు వేస్తున్నాయి. ఇంతకీ మ్యాక్స్‌వెల్‌ అంటే ఎందుకు అంత భయమంటే.. కేవలం ఐదంటే ఐదు ఓవర్లలోనే మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా మ్యాక్సీ సొంతం. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ తన విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. 292 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆల్‌మోస్ట్‌ ఓడిపోయింది. కానీ, తనకేదో కాంతారా పూనినట్లు.. ఏకంగా డబుల్‌ సెంచరీతో ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓడిపోయింటే.. కప్పు టీమిండియాదే అనే భావన కూడా చాలా మంది క్రికెట్‌ అభిమానుల్లో ఉంది.

ఆ మ్యాచ్‌ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ తన సత్తా చాటాడు మ్యాక్సీ. తనకంటే ఒక పరిమితమైన స్టైల్‌ లేకుండా.. ఒక్క బాల్‌ను పది విధాలుగా ఆడగల టాలెంట్‌ అతని సొంతం. అందుకే అతన్ని అవుట్‌ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువైన విషయం కాదు. చాలా సార్లు తన తప్పిందంతోనే మ్యాక్సీ అవుట్‌ అయ్యాడు కానీ, బౌలర్‌ అద్భుతమైన బంతులకు వికెట్‌ ఇచ్చింది చాలా అరుదు. ఆకలేసిన సింహం ఎలా వేటాడుతుందో.. పరుగుల దాహం వేస్తే మ్యాక్స్‌ అలా ఒక మృగంలాగా, ఒక బీస్ట్‌లాగా ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టేస్తాడు. ఇండియాలోనే బ్యాటింగ్‌కు అత్యంత కష్టమైన పిచ్‌గా ఉన్న చెన్నైలోని పి.చిదంబరం స్టేడియం ఉంది. అలాంటి పిచ్‌పై కూడా ఫస్ట్‌ బాల్‌ నుంచి హిట్టింగ్‌ చేయగల మొండోడు మ్యాక్స్‌వెల్‌. అందుకే అతనంటే బౌలర్లకు దడ. వరల్డ్‌ కప్‌ నుంచి మ్యాక్సీ ఉన్న ఫామ్‌ చూస్తుంటే.. ఈ సారి ఐపీఎల్‌లో అతని విలయతాండవం చూడొచ్చు. అందుకే అన్ని టీమ్స్‌ ఒక్క మ్యాక్స్‌వెల్‌ అంటే భయపడుతున్నాయి. మరి ఐపీఎల్‌ 2024లో మ్యాక్స్‌వెల్‌ ఎలా  ఆడతాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి