iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్.. పంత్ రీ ఎంట్రీపై ఆందోళన పెడుతున్న జై షా వ్యాఖ్యలు!

  • Published Mar 12, 2024 | 8:23 AM Updated Updated Mar 12, 2024 | 8:23 AM

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ ఆడే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఫ్యాన్స్ ను ఆందోళన పరుస్తున్నాయి. ఇంతకీ జై షా ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ ఆడే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఫ్యాన్స్ ను ఆందోళన పరుస్తున్నాయి. ఇంతకీ జై షా ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్.. పంత్ రీ ఎంట్రీపై ఆందోళన పెడుతున్న జై షా వ్యాఖ్యలు!

రిషబ్ పంత్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు. కారు ప్రమాదంతో తీవ్ర గాయపడి, మృత్యుంజయుడిగా బయటపడ్డాడు ఈ స్టార్ ప్లేయర్. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చికిత్స తీసుకున్న ఇతడు.. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్ టోర్నీ కోసం ప్రాక్టీస్ ను కూడా మెుదలుపెట్టాడు. ప్రాక్టీస్ లో భారీ షాట్లతో విరుచుకుపడిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్ లో పంత్ ఆడే అవకాశాలపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్ కు సన్నద్ధమవుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. నేషనల్ క్రికెట్ అకాడమీ సైతం అతడి ఫిట్ నెస్ పై క్లియరెన్స్ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో పంత్ ఐపీఎల్ లో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో పంత్ ఆడతాడా? లేడా? అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలు పంత్ ఫ్యాన్స్ ను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి.

జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ..”రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే అతడి ఫిట్ నెస్ కు సంబంధించిన ప్రకటనను విడుదల చేస్తాం. అయితే అతడు టీ20 ప్రపంచ కప్ ఆడాలంటే కచ్చితంగా కీపింగ్ చేయాల్సి వస్తుంది. మిగతా అంశాలను పరిస్థితులను బట్టి చూడాల్సి ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు జై షా. దీంతో ఈ కామెంట్స్ పంత్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే? ప్రస్తుతం అతడు ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ చేయాల్సి ఉంది. అయితే అతడిపై ఎక్కువ భారం పడకుండా.. కీపింగ్ బాధ్యతలను వేరే వారికి అప్పగించే అవకాశాలు కొట్టిపారేయలేమని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ లో పంత్ కీ ప్లేయర్ గా మారతాడని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో జై షా కామెంట్స్ కాస్త టెన్షన్ పెడుతున్నాయి. మరి టీ20 వరల్డ్ కప్ లో పంత్ ఆడటంపై జై షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్.. గుజరాత్ ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి!