iDreamPost

నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్.. గుజరాత్ ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ కు విజయాన్ని కట్టబెట్టింది వైజాగ్ అమ్మాయి షబ్నమ్ షకీల్. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ కు విజయాన్ని కట్టబెట్టింది వైజాగ్ అమ్మాయి షబ్నమ్ షకీల్. పూర్తి వివరాల్లోకి వెళితే..

నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్.. గుజరాత్ ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ జెయింట్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. అయితే ఆ ఓటములకు బ్రేక్ ఇచ్చింది. WPLలో భాగంగా సోమవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీంతో టోర్నీలో రెండో గెలుపును సాధించింది. ఇక నరాలు తెగే ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ కు విజయాన్ని కట్టబెట్టింది వైజాగ్ అమ్మాయి షబ్నమ్ షకీల్.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై అద్భుత విజయం సాధించింది గుజరాత్ జెయింట్స్ టీమ్. చివరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠంగా సాగిన పోరులో గుజరాత్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ బెత్ మూనీ 52 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్ తో 74 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. మిగతావారిలో లారా వాల్ వార్ట్ 43 పరుగులతో రాణించింది. వారియర్స్ బౌలర్లలో ఎకెల్ స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు.

అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ టీమ్ కు వైజాగ్ అమ్మాయి షబ్నమ్ షకీల్ ఆదిలోనే షాకిచ్చింది. 4 రన్స్ కే 2 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి వైపు సాగింది. కానీ అనూహ్యంగా చెలరేగిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ మెరుపు అర్ధసెంచరీతో విజయంపై ఆశలురేపింది. దీప్తి 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కానీ టీమ్ కు మాత్రం విజయాన్ని అందించలేకపోయింది. వారియర్స్ విజయానికి చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా.. దీప్తి రెండు సిక్సర్లతో సహా 17 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టిన షబ్నమ్ 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను తీసుకుంది. మరి గుజరాత్ ను గెలిపించిన వైజాగ్ అమ్మాయిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 ఇదికూడా చదవండి: అయ్యర్​ను విమర్శించొద్దు.. శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి