iDreamPost
android-app
ios-app

టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి ప్రధాని మోదీ, సచిన్‌ అప్లికేషన్లు!

  • Published May 28, 2024 | 1:20 PM Updated Updated May 28, 2024 | 1:20 PM

BCCI, Head Coach, Sachin Tendulkar, PM Modi: టీమిండియా హెచ్‌ కోచ్‌ పదవి కోసం సచిన్‌ టెండూల్కర్‌, ప్రధాని మోదీ పేర్లతో అప్లికేషన్లు రావడం సంచలనంగా మారింది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

BCCI, Head Coach, Sachin Tendulkar, PM Modi: టీమిండియా హెచ్‌ కోచ్‌ పదవి కోసం సచిన్‌ టెండూల్కర్‌, ప్రధాని మోదీ పేర్లతో అప్లికేషన్లు రావడం సంచలనంగా మారింది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 28, 2024 | 1:20 PMUpdated May 28, 2024 | 1:20 PM
టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి ప్రధాని మోదీ, సచిన్‌ అప్లికేషన్లు!

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త కోచ్‌ వేటలో పడింది. ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఆ దరఖాస్తు గడవు సోమవారం(మే 27)తో ముగిసింది. మొత్తంగా బీసీసీఐ 3 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. అందులో చాలా అప్లికేషన్లలో దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్లతో కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లు చూసి బీసీసీఐ అధికారులు షాకైనట్లు తెలుస్తోంది.

అయితే వచ్చిన 3 వేల అప్లికేషన్లలో చాలా వరకు ఫేక్‌ అని తేలింది. అయితే కొన్ని అప్లికేషన్లను రీచెక్‌ చేసుకోవడానికి బీసీసీఐ వారితో మెయిల్‌ కాన్వర్జేషన్‌ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా టీమిండియా హెడ్‌ కోచ్‌ బాధ్యతలను ఎవరు చేపడతారని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కోచ్‌గా ఎంపికైతే.. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు వాళ్లే టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టీమ్‌ను తమ ప్లాన్స్‌కు తగ్గట్లు నిర్మించుకునే అవకాశం మెండుగా ఉంది. మరి ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

ద్రవిడ్‌ స్థానంలో తొలుత ఒక విదేశీ కోచ్‌ను తీసుకొని రావాలని బీసీసీఐ పెద్దలు భావించారు. కానీ, తర్వాత తమ నిర్ణయం మార్చుకుని.. ఇండియన్‌ క్రికెట్‌ గురించి మంచి అవగాహన ఉండి, డొమెస్టిక్‌ లెవెల్‌ క్రికెట్‌ను కూడా అర్థం చేసుకున్న ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ అయితే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత బీసీసీఐ కార్యదర్శి జైషా.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మెంటర్‌గా వ్యవహరించిన గౌతమ్‌ గంభీర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. వారి మధ్య టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి గురించే చర్చ నడిచి ఉంటుందని, టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.