iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీకి BCCI ఓపెన్ ఆఫర్! ఇదే మంచి ఛాన్స్!

  • Author singhj Published - 12:34 PM, Thu - 23 November 23

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట. దీంతో వాళ్లకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట. దీంతో వాళ్లకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

  • Author singhj Published - 12:34 PM, Thu - 23 November 23
రోహిత్, కోహ్లీకి BCCI ఓపెన్ ఆఫర్! ఇదే మంచి ఛాన్స్!

స్పోర్ట్స్ ప్లేయర్ కెరీర్​ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఎండ్ అవ్వక తప్పదు. ఎంతటి దిగ్గజ ఆటగాడైనా ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే ఆడినన్ని రోజులు తమ దేశానికి ఎంత బాగా సేవలు అందించారనేది ముఖ్యం. కొందరు ఆటగాళ్లయితే సరిగ్గా రాణించకపోయినా, ఫిట్​నెస్​ ఇష్యూస్ ఉన్నా టీమ్స్​ను పట్టుకొని వేలాడతారు. సీనియర్స్ అనే ట్యాగ్ ఉండటం వల్ల వారిని అంత సులువుగా జట్టు నుంచి తీసేయడానికి ఉండదు. కానీ ఇంకొందరు ఆటగాళ్లు మాత్రం తమలో ఆడే సత్తా లేదని తెలిసినా, ఇంకా గేమ్ ఆడలేమని ఫీలింగ్ వచ్చినా వెంటనే హుందాగా తప్పుకుంటారు. ఆ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ అనే తేడా లేదు.. అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో క్రికెట్​ కూడా మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్ నుంచి హుందాగా తప్పుకున్న ప్లేయర్లు ఎందరో ఉన్నారు.

కెరీర్ చరమాంకంలో ఉన్న క్రికెటర్లు ముందే మంచి డెసిజన్స్ తీసుకోవాలి. దీని వల్ల తమ కెరీర్​ను మరింత కాలం పొడిగించుకోవచ్చు. తొందరపడో లేదా ఎమోషనల్​గా నిర్ణయం తీసుకునే బదులు బాగా ఆలోచించి డెసిజన్ తీసుకుంటే మరింత కాలం దేశానికి సేవలు అందించొచ్చు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇచ్చిందని తెలుస్తోంది. వీళ్లిద్దరూ దాదాపుగా 15 ఏళ్ల నుంచి టీమిండియాకు ఆడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కోహ్లీ ఇప్పటికే జట్టుకు కెప్టెన్సీ కూడా చేసి ఆ తర్వాత తప్పుకున్నాడు. ప్రస్తుతం భారత్​కు హిట్​మ్యాన్ నాయకత్వం వహిస్తున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమ్​లో సభ్యుడిగా ఉన్నాడు రోహిత్. 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ ఓ మెంబర్ అనేది తెలిసిందే.

కోహ్లీ-రోహిత్​లు తమ కెరీర్​లో వరల్డ్ కప్ సాధించారు. జూనియర్లుగా ఉన్నప్పుడు ఛాంపియన్స్​ టీమ్స్​లో భాగమయ్యారు. కానీ స్టార్లుగా మారి టీమ్ భారాన్ని మోస్తున్న ఈ టైమ్​లో వరల్డ్ కప్ నెగ్గితే బాగుండేదని వాళ్లిద్దరితో పాటు అభిమానులు కూడా భావించారు. కానీ రీసెంట్​గా జరిగిన వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోవడంతో విరాట్-రోహిత్ కల నెరవేరలేదు. దీంతో వీళ్ల ఫ్యూచర్ ఏంటి? 35 ఏళ్లున్న కోహ్లీ, 36 సంవత్సరాల హిట్​మ్యాన్ టీమ్​లో కొనసాగుతారా? ముఖ్యంగా టీ20 జట్టులో కంటిన్యూ అవుతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరో 7 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వీళ్లిద్దరూ ఆ టోర్నీలో ఆడతారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే తాను టీ20ల్లో కొనసాగనని.. వన్డేలు, టెస్టుల్లో ఆడతానని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు కూడా వినికిడి. కానీ దీనిపై అటు బోర్డు నుంచి గానీ ఇటు భారత కెప్టెన్ నుంచి గానీ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కాగా, రోహిత్-కోహ్లీ కెరీర్ విషయంలో డెసిజన్​ను వాళ్లకే వదిలేసిందట బోర్డు. వాళ్లిద్దరి మీద సదభిప్రాయంతో ఉన్న బీసీసీఐ.. కెరీర్ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకునే ఛాన్స్​ను వాళ్ల ఇష్టానికే వదిలేసిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ఏ ఫార్మాట్​లో కంటిన్యూ అవ్వాలి? ఎందులో నుంచి తప్పుకోవాలనే దానిపై పూర్తి స్వేచ్ఛను కోహ్లీ-రోహిత్​కు ఇచ్చిందట. ఇద్దరు లెజెండరీ క్రికెటర్స్ విషయంలో బోర్డు ఇలా వ్యవహరించడం శుభపరిణామంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు బంతి రోహిత్-కోహ్లీ కోర్టులోనే ఉంది. ఇద్దరి వయసు రీత్యా టీ20ల నుంచి తప్పుకుంటే బెటర్. ఫిట్​నెస్​ను కాపాడుకుంటూ కష్టపడతాం అనుకుంటే పొట్టి ఫార్మాట్​లో కంటిన్యూ అవ్వొచ్చు. రిస్క్ ఎందుకనుకుంటే టీ20ల నుంచి తప్పుకొని వన్డేలు, టెస్టుల్లో కొనసాగొచ్చు. అప్పుడే మరింత కాలం టీమ్​కు ఆడొచ్చు. వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి కీలక టోర్నీలు ఉన్నాయి. కాబట్టి ఐసీసీ ట్రోఫీ సాధించాలనే డ్రీమ్​ను నెరవేర్చుకునేందుకు వీలుంటుంది. మరి.. బీసీసీఐ ఓపెన్ ఆఫర్​ విషయంలో కోహ్లీ-రోహిత్ ఎలాంటి డెసిజన్ తీసుకుంటారో చూడాలి. బోర్డు ఇచ్చిన ఆఫర్​పై మీరేం అనుకుంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గిల్​కు స్పాట్ పెడుతున్న కోహ్లీ.. యంగ్​ ఓపెనర్​కు ఇకపై కష్టమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి