Nidhan
భారత క్రికెట్‌ను మలుపు తిప్పిన వాటిల్లో ఐపీఎల్ ఒకటి. ఈ లీగ్ వల్ల ఇటు బోర్డు ఖజానాలో రూ.కోట్లు వచ్చి పడగా.. అటు ఆటగాళ్ల మీదా కాసుల వర్షం కురిసింది. ఈ లీగ్ వల్ల ఎంతో మంది కొత్త ప్లేయర్లు టీమిండియా తలుపు తట్టారు. అలాంటి ఈ లీగ్ తరహాలో మరో కొత్త లీగ్‌కు బీసీసీఐ ప్లాన్ చేస్తోందట.
భారత క్రికెట్‌ను మలుపు తిప్పిన వాటిల్లో ఐపీఎల్ ఒకటి. ఈ లీగ్ వల్ల ఇటు బోర్డు ఖజానాలో రూ.కోట్లు వచ్చి పడగా.. అటు ఆటగాళ్ల మీదా కాసుల వర్షం కురిసింది. ఈ లీగ్ వల్ల ఎంతో మంది కొత్త ప్లేయర్లు టీమిండియా తలుపు తట్టారు. అలాంటి ఈ లీగ్ తరహాలో మరో కొత్త లీగ్‌కు బీసీసీఐ ప్లాన్ చేస్తోందట.
Nidhan
భారత క్రికెట్ బోర్డు గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. వరల్డ్ క్రికెట్లో అత్యంత రిచెస్ట్ బోర్డ్‌గా కొనసాగుతోంది బీసీసీఐ. ఇతర ఏ క్రికెట్ బోర్డు దగ్గర లేనంత ధనం మన బోర్డు దగ్గర ఉందని అంటున్నారు. బీసీసీఐ నికర విలువ అక్షరాలా 2.25 బిలియన్లు (ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.18,700 కోట్లు) అని ఇటీవల ఓ రిపోర్టు వెల్లడించింది. భారత క్రికెట్ బోర్డు తర్వాతి ప్లేసులో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదాయం 79 మిలియన్లు అని తెలుస్తోంది. ఆ లెక్కన సంపాదనలో రెండో స్థానంలో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కంటే 28 రెట్లు ముందంజలో ఉంది భారత్. దాదాపు 10 బోర్డుల మొత్తం ఆదాయాన్ని కలిపినా బీసీసీఐ ఆదాయంలో 85 శాతం కూడా ఉండదని సమాచారం. టీమిండియాతో మ్యాచులు ఆడటం వల్ల ఇతర దేశాల బోర్డులకు భారీ మొత్తంలో డబ్బు సమకూరుతోంది. అందుకే భారత్‌తో సిరీస్‌ల నిర్వహణకు బడా టీమ్స్ కూడా పోటీపడుతున్నాయి.
ఆదాయంలో బీసీసీఐ మిగిలిన బోర్డుల కంటే టాప్‌లో ఉండటానికి, ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా అవతరించడానికి ప్రధానం కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే చెప్పాలి. మెగా లీగ్ బీసీసీఐకి బంగారు బాతుగా మారింది. టీ20 క్రికెట్ క్రమంగా పాపులర్ అవుతున్న టైమ్‌లో ఆ ఫార్మాట్లో లీగ్ పెట్టాలనే ఆలోచన నుంచే ఐపీఎల్ పుట్టింది. దేశంలోని ప్రధాన నగరాలను తీసుకొని వాటి పేర్ల మీద ఫ్రాంచైజీలు పెట్టాలని బీసీసీఐ డిసైడ్ అయింది. అలా వేలం నిర్వహించడం, ఒక్కో ఫ్రాంచైజీకి స్టార్ ప్లేయర్లను కెప్టెన్లుగా పెట్టడం, ఫారెన్ ప్లేయర్లతో పాటు లోకల్ స్టార్స్నూ ఆడించడంతో లీగ్ ఫుల్ సక్సెస్ అయింది. భారత బోర్డుకు వచ్చే ఆదాయంలో సింహ భాగం ఐపీఎల్ నుంచే వస్తోంది. ఐపీఎల్‌తో పాటు టీమిండియా ఆడే మ్యాచులు, టెలివిజన్ రైట్స్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం సమకూరుతోంది.
ఐపీఎల్ బడా హిట్టవడంతో ఇప్పుడు అలాంటి మరో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోందట. అయితే టీ20ల్లో కాకుండా ఈ మధ్య బాగా పాపులరైన టీ10 ఫార్మాట్‌ను ఎంచుకుందట. టీ10 ఫార్మాట్లో భారీ లీగ్‌కు ప్లాన్ చేస్తోందట భారత బోర్డు. ఇప్పటికే దీని బ్లూ ప్రింట్ తయారు చేయడంలో బీసీసీఐ సెక్రటరీ జై షా సహా పలువురు బోర్డు పెద్దలు బిజీగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో టీ10 లీగ్‌ను నిర్వహించాలని షెడ్యూల్ చేస్తున్నట్లు న్యూస్ వస్తోంది. అయితే ఈ లీగ్ నిర్వహణను ఐపీఎల్ ఫ్రాంచైజీలకే అప్పగించాలా? అనే అంశంపై బోర్డు ప్రత్యేకంగా చర్చిస్తోందని టాక్. అలాగే టీ10 లీగ్ నిర్వహణను భారత్‌లోనే నిర్వహించాలా? లేదా ప్రతి ఏడాది వేదికను మార్చాలా? అనే దాని మీదా డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఈ లీగ్‌లో ఆడే ప్లేయర్లకు ఏజ్ లిమిట్ విధించాలా? అనేది కూడా పరిశీలిస్తున్నారట. మరి.. బీసీసీఐ టీ10 లీగ్ ఐడియాపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లెజండ్స్ లేని వేళ.. టీమ్ కి అండగా సూర్య.. ఒకనాటి సచిన్ లా!
As per reports, BCCI may launch new cricket league in T10 format next year 🏏#BCCI #T10League #IPL #CricketTwitter pic.twitter.com/KyuVEx6wgY
— InsideSport (@InsideSportIND) December 15, 2023