iDreamPost

లెజండ్స్ లేని వేళ.. టీమ్ కి అండగా సూర్య.. ఒకనాటి సచిన్ లా!

సూర్య కుమార్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఇంకో అద్భుతం చేశాడు. కష్టకాలంలో తన మనో దైర్యం చూపాడు. ట్రాక్ తప్పాల్సిన ఇండియాని సక్సెస్ రూట్ స్థిరంగా నిలబెట్టాడు.

సూర్య కుమార్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఇంకో అద్భుతం చేశాడు. కష్టకాలంలో తన మనో దైర్యం చూపాడు. ట్రాక్ తప్పాల్సిన ఇండియాని సక్సెస్ రూట్ స్థిరంగా నిలబెట్టాడు.

లెజండ్స్ లేని వేళ..  టీమ్ కి అండగా సూర్య.. ఒకనాటి సచిన్ లా!

వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఓటమి ఇప్పట్లో మరచిపోలేని జ్ఞాపకం. ఆ మ్యాచ్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎవ్వరూ ఆ బాధ నుండి పూర్తిగా బయటకు రాలేదు. రోహిత్, కోహ్లీ వంటి లెజెండ్స్ అయితే.. ఇంకా బ్యాట్ కూడా పట్టనే లేదు. ఫ్యాన్స్ అంతా వారి రాక కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ.., కాలం మన కోసమో, కోహ్లీ కోసమో, రోహిత్ కోసమో ఆగదు కదా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. నిర్ధాక్షిణంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోద్ది. ఆ కాల ప్రవాహంలోనే వరల్డ్ కప్ ముగిశాక.. వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్ వచ్చి పడింది. అది పూర్తి అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సౌత్ ఆఫ్రికా టూర్. అక్కడ కూడా ముందుగా టీ-20 సిరీస్ లు ముగిశాయి. ఈ రెండు సిరీస్ లని ఇండియా కాపాడుకుంది.

వరల్డ్ కప్ పోయాక కూడా సగర్వంగా నిలవగలిగింది. పరువు పోకుండా పోరాడగలిగింది. ఒక్క ఓటమితో చీకట్లు కమ్మేసిన టీమిండియాకి.. అంతలోనే ఇన్ని వెలుగులా? ఎవరీ విజయాలకు కారణం? ఎవరీ కాంతులను తెచ్చి పెట్టింది అంటే.. వినిపించే ఒకే ఒక్క మాట సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అతని ఆటకి తిరుగులేదు. కానీ.., కేవలం ఇలా ఆడినందుకు మాత్రమే సూర్యని అందరూ మెచ్చుకోవడం లేదు. అతను ఇంకో అద్భుతం చేశాడు. కష్టకాలంలో తన మనో దైర్యం చూపాడు. ట్రాక్ తప్పాల్సిన ఇండియాని సక్సెస్ రూట్ లో స్థిరంగా నిలబెట్టాడు.

మీడియాకి, అభిమానులకి మొహం కూడా చూపించలేనంత బాధలో సీనియర్స్ వెనుతిరిగితే సూర్య.. నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. అతన్ని ఆస్ట్రేలియా టూర్ కి కెప్టెన్ గా ప్రకటించగానే అంతా దుమ్మెత్తి పోశారు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ-20 లో సెంచరీ కొట్టినా.. ఇప్పుడు ఎందుకు ఈ ఆట అని చీదరించుకున్నారు. సూర్య వాటన్నిటిని భరించాడు. వరుసగా ఒక్కో మ్యాచ్ గెలిపించుకుంటూ పోయాడు. ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చింది. మళ్ళీ క్రికెట్ ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అందరూ యధావిధిగా మ్యాచ్ లు చూసేలా చేశాడు. ఇందుకే సూర్య సెంచరీలు మాత్రమే కాదు అతని మనో నిబ్బరం కూడా టీమిండియాని ఒక సందిగ్ద స్థితి నుండి బయట పడేశాయి.

ఈరోజు టీ20 క్రికెట్ లో సూర్య సృష్టిస్తున్న విధ్వంసం శాశ్వతమా అంటే కాదు. ఇంతకు మించిన ఆటగాడు వస్తాడు. ఇంతకు మించిన రికార్డులు పుట్టుకొస్తాయి. కానీ.., టీమిండియా కష్టకాలంలో ఉన్నప్పుడు మీడియాని, ఫ్యాన్స్ ని, ప్రత్యర్థులని, అందర్నీ ఫేస్ చేసిన విధానం మాత్రం ఎప్పటికీ చెదిరిపోనిది. గతంలో ఇలాంటి కష్టకాలమే టీమిండియాకి ఒకసారి వచ్చింది. కెప్టెన్ అజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చే సరికి టీమ్ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఆ సమయంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ అనే ముగ్గురు కుర్రాళ్ళు ముందుకు వచ్చి బాధ్యత పంచుకున్నారు. మన దేశంలో క్రికెట్ చచ్చిపోకుండా కాపాడారు. కోట్ల మంది అభిమానుల చేత ఇండియా.. ఇండియా.. అంటూ కేకలు, అరుపులు పెట్టించారు. నేడు.. ఈ తక్కువ సమయంలో సూర్య కుమార్ యాదవ్ చూపించిన తెగువ.. దానికి తక్కువ ఏమి కాదు. ఇందుకే హ్యాట్సాఫ్ సూర్య. మరి.. ఈ విషయంలో మీరేమంటారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి