iDreamPost
android-app
ios-app

Rohit-Gill: టీమిండియాలో కీలక పరిణామం! రోహిత్ కు షాక్.. కెప్టెన్ గా గిల్!

  • Published Jan 05, 2024 | 4:01 PM Updated Updated Jan 05, 2024 | 4:01 PM

ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ తో పాటు. జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై తర్జనభర్జన జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియాలో కీలక పరిణామం చోటుచేసుకునేలా కనిపిస్తోంది.

ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ తో పాటు. జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై తర్జనభర్జన జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియాలో కీలక పరిణామం చోటుచేసుకునేలా కనిపిస్తోంది.

Rohit-Gill: టీమిండియాలో కీలక పరిణామం! రోహిత్ కు షాక్.. కెప్టెన్ గా గిల్!

గత కొంతకాలంగా టీమిండియా, బీసీసీఐ మధ్య అయోమయం నెలకొంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ తో పాటు. జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై తర్జనభర్జన జరుగుతోంది. ప్రస్తుతం టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు గాయం కారణంగా దూరం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా కెప్టెన్ రేసులోకి వచ్చాడు యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్. రోహిత్ ప్లేస్ లో ఆఫ్గాన్ తో జరిగే సిరీస్ కు గిల్ పేరును కెప్టెన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇతడితో పాటుగా మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నారట.

టీమిండియాలో కీలక పరిణామం చోటుచేసుకునేలా కనిపిస్తోంది. ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ తో పాటుగా వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి రోహిత్ సైతం అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత్ ను కాదని ఆఫ్గాన్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ పేరును పరిశీలిస్తున్నారట బీసీసీఐ పెద్దలు. వీలైతే రోహిత్ ను, కాదంటే.. గిల్ ను ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఎంపికచేసే ఆలోచనలో ఉన్నారట.

ఇదిలా ఉండగా.. వీరితో పాటుగా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాతో పాటుగా శ్రేయస్ అయ్యర్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నారు. జడేజా, శ్రేయస్ లకు గిల్ కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. దీంతో సెలెక్టర్లు వీరిద్దరిపై మెుగ్గుచూపే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే ఈలోగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు గాయం నుంచి కోలుకుంటే వారిలో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పగిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గిల్ లాంటి అనుభవం లేని ఆటగాడికి కెప్టెన్ గా పగ్గాలు అందిస్తే.. అతడు ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుని నాయకుడిగా నిలబడతాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి టీ20 కెప్టెన్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.