Nidhan
టీమిండియా ప్లేయర్స్‌పై కనకవర్షం కురవనుంది. అందుకోసం బీసీసీఐ చేస్తున్న ప్లానింగ్ గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
టీమిండియా ప్లేయర్స్‌పై కనకవర్షం కురవనుంది. అందుకోసం బీసీసీఐ చేస్తున్న ప్లానింగ్ గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
Nidhan
ఒకప్పుడు క్రికెట్లో టెస్టులు, వన్డేలు మాత్రమే ఉండేవి. ఓడీఐలతో జెంటిల్మన్ గేమ్‌కు ఆదరణ పెరిగినా ప్లేయర్లు లాంగ్ ఫార్మాట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. టెస్ట్ జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావించేవారు. కానీ లీగ్స్ ఎంట్రీతో ఆట స్వరూపమే మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా లీగ్‌లు పుట్టుకురావడంతో ఆటగాళ్ల మీద కనకవర్షం కురిసింది. రూ.కోట్లకు రూ.కోట్లు వచ్చి పడటంతో ప్లేయర్లకు టీ20ల మీద ఉన్నంత ఆసక్తి మిగతా ఫార్మాట్లపై ఉండటం లేదు. నేషనల్ టీమ్స్‌కు ఆడటం కంటే లీగ్స్‌కు ఆడటానికే కొందరు ఆటగాళ్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ బోర్డు నడుం బిగించింది. టెస్టుల్లో ఆడటం ద్వారా ప్లేయర్ల మీద కాసుల వర్షం కురిసేలా ప్లాన్ చేస్తోంది. అసలు బీసీసీఐ ప్లానింగ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లలో ఆసక్తిని పెంచాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. తద్వారా టెస్టుల మనుగడ కాపాడటంతో పాటు టీ20లు, వన్డేల్లోనూ ప్లేయర్లు మరింత బాగా ఆడేందుకు దోహదపడుతుందని అనుకుంటోంది. అందుకోసం మ్యాచ్ ఫీజుల్ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. ఒక ప్లేయర్ రంజీ ట్రోఫీలోని అన్ని మ్యాచులు ఆడితే అతడికి రూ.75 లక్షలు అందేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. అదే ఒక ఆటగాడు భారత్ తరఫున ఒక ఏడాదిలో అన్ని టెస్టు మ్యాచులు ఆడితే అతడికి ఏకంగా రూ.15 కోట్ల వరకు చెల్లించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని క్రికెట్ వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో బోర్డు చర్చలు కూడా మొదలుపెట్టిందని తెలుస్తోంది.
సాధారణంగా లీగ్స్‌లో ఆడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అటు వైపు ఆటగాళ్లు అధికంగా ఆసక్తి చూపిస్తుంటారు. ఆడితే భారత్‌కు ఆడాలి లేదా లీగ్స్‌లో ఆడాలి. అంతేగానీ టీమ్‌కు దూరంగా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అనుకోరు. కుదిరితే రెస్ట్ తీసుకోవాలని ప్లేయర్లు భావిస్తారు. ఒకవేళ టీమ్‌లో ఉన్నా టెస్టుల్లో ఆడేందుకు కొందరు ఆటగాళ్లు ఆసక్తి చూపించరు. ఈ నేపథ్యంలో జట్టుకు దూరంగా ఉండే ప్రతి క్రికెటర్ దేశవాళీల్లో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది. ఫామ్, ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు దీన్ని మించిన మార్గం లేదని బోర్డు భావిస్తోంది.
ఇండియాకు ఆడిన వాళ్లు డొమెస్టిక్‌లో బరిలోకి దిగితే ఆ అనుభవం ఇతర యంగ్స్టర్స్కూ హెల్ప్ అవుతుందని బీసీసీఐ అనుకుంటోంది. దీని వల్ల రంజీలు లాంటి దేశవాళీ టోర్నీలకు మరింత క్రేజ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. అందుకే ఆటగాళ్లకు డొమెస్టిక్ మ్యాచ్‌లు, టెస్టులు ఆడేందుకు ప్రోత్సహిస్తోంది బోర్డు. ఈ క్రమంలోనే రోహిత్, ధోని, అగార్కర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మ్యాచ్ ఫీజులు పెంచడం ద్వారా టెస్టులు, రంజీ ట్రోఫీ మ్యాచులు ఆడి కూడా భారీ మొత్తంలో డబ్బుల్ని వెనకేసుకునే అవకాశాన్ని ఆటగాళ్లకు కల్పించాలని అనుకుంటోందట. అయితే దీనిపై ఇంకా అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు. ఈ విషయం తెలిసిన నెజటిన్స్ రియాక్ట్ అవుతున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు బోర్డు చేస్తున్న కృషి ప్రశంసనీయం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టెస్టులపై ఆసక్తిని పెంచేందుకు బీసీసీఐ తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇషాన్, అయ్యర్‌కే రూల్స్ వర్తిస్తాయా? పాండ్యాకు వర్తించవా?: భారత్ క్రికెటర్
The BCCI in talks with Rohit Sharma, Dravid and Agarkar to revive interest in Red Ball cricket (TOI):
– If a Player plays all Ranji Trophy matches he could be making 75 Lakhs.
– If a Player plays all Tests a year he’ll be likely making 15cr. pic.twitter.com/SlK7Ce2pd2
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 29, 2024