Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారత క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇవ్వడం తెలిసిందే. అతడి కాంట్రాక్టును బోర్డు రద్దు చేయడం విదితమే. అయితే అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారత క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇవ్వడం తెలిసిందే. అతడి కాంట్రాక్టును బోర్డు రద్దు చేయడం విదితమే. అయితే అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Nidhan
భారత క్రికెట్ బోర్డుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోమారు ప్రూవ్ అయింది. తమ ఆదేశాలను పాటించలేదని స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌పై వేటు వేసింది బీసీసీఐ. వాళ్లిద్దరి కాంట్రాక్టులను రద్దు చేసింది. దీంతో టీమిండియాలోకి వాళ్లు రీఎంట్రీ ఇవ్వడం కష్టంగా మారింది. ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించి ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకుంటే గానీ కమ్‌బ్యాక్ ఇవ్వలేరు. ఒకవేళ బాగా ఆడినా రీఎంట్రీకి కోచ్ ద్రవిడ్, బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు అంతా ఓకే అన్నాకే టీమ్‌లోకి వస్తారు. ఇంత తతంగం ఉండటంతో ఇప్పట్లో వాళ్లిద్దరూ భారత్‌కు ఆడటం కష్టమేనని అంటున్నారు. అయితే అయ్యర్ మీద ఎక్కువ మంది సానుభూతి చూపిస్తున్నారు. ఇషాన్ బోర్డుతో కావాలని పెట్టుకున్నాడని.. అతడ్ని తీసేయడంలో తప్పు లేదంటున్నారు. కానీ అయ్యర్ విషయంలో మాత్రం బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత జట్టు కోసం ఎంతో చేసిన ఆటగాడ్ని ఇలా కాంట్రాక్ట్ తీసేసి అవమానించడం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 కోసం ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో గతేడాది కావాలనే ఐపీఎల్లో ఆడలేదట అయ్యర్. టీమిండియా కోసం రూ.కోట్లకు రూ.కోట్లు వచ్చే ఛాన్స్‌ను వద్దనుకున్నాడట. క్యాష్ రిచ్ లీగ్ కంటే దేశానికి ఆడటమే తన ప్రాధాన్యతగా పెట్టుకున్నాడట. అందుకే ఐపీఎల్లో ఆడకుండా డైరెక్ట్‌గా వెళ్లి బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడని సమాచారం. ఆ తర్వాత ఫిట్నెస్ సాధించిన ఈ స్టైలిష్ బ్యాటర్.. ప్రపంచ కప్‌లో ఏ రేంజ్లో దుమ్మురేపాడో తెలిసిందే. అనంతరం జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లోనూ తన బ్యాట్ పవర్ చూపించాడు. అలాగే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఓ రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. ఇలా బీసీసీఐ కాంట్రాక్ట్‌కు అన్ని విధాలుగా న్యాయం చేసినా.. అతడ్ని హఠాత్తుగా తీసేయడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో మిగిలిన సిరీస్‌కు తప్పించడంతో దొరికిన టైమ్‌ను రెస్ట్ తీసుకునేందుకు ఉపయోగించుకోవాలని అయ్యర్ భావించాడని టాక్. విశ్రాంతి తీసుకొని ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచ కప్‌లోనూ దుమ్మురేపాలని అనుకున్నాడట. ఒకవేళ రంజీల్లో ఆడితే ఎక్కడ గాయం తిరగబెడుతోందోనని భయపడ్డాడని సమాచారం. కానీ ఈ విషయాన్ని బోర్డు పెద్దలకు, టీమ్ మేనేజ్మెంట్కు చెప్పి ఒప్పించాల్సింది పోయి.. గాయం సాకుతో ఎన్సీఏకు వెళ్లడమే అతడు చేసిన తప్పని చెబుతున్నారు. అయితే అద్భుతంగా రాణిస్తున్న ఆటగాడ్ని, వన్డే వరల్డ్ కప్‌లో 66.52 స్ట్రయిక్ రేట్‌తో 500కు పైగా పరుగులు, సెమీఫైనల్లో సెంచరీ బాదినోడ్ని ఎలా తీసేస్తారని అయ్యర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ విషయంలో బోర్డు తొందరపడిందని.. ఇషాన్‌పై వేటు వేయడం ఖాయం కాబట్టి అయ్యర్‌ను కూడా బలిపశువును చేశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఆటగాళ్లతో నేరుగా కూర్చొని మాట్లాడాల్సింది పోయి.. ఇలా కాంట్రాక్ట్ తీసేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత 6 నెలలుగా టెస్టులతో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కూ దూరంగా ఉంటున్నాడని.. కానీ అతడికి మాత్రం గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. మరి.. అయ్యర్ విషయంలో బీసీసీఐ తొందరపడిందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. భారత క్రికెట్లో అతడే అందరికంటే పవర్ఫుల్!
Is there a legitimate reason for the BCCI to exclude Shreyas Iyer from the contract? 👀#BCCI #ShreyasIyer #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/xYJnY1EKzB
— InsideSport (@InsideSportIND) February 29, 2024
Shreyas Iyer didn’t deserve this ….
Do you think it’s fair ????#BCCI #ShreyasIyer #IshanKishan #HardikPandya #BCCICentralContractpic.twitter.com/1yvtFiCDuX
— Anvar Khan (@anvarkhan63) February 29, 2024