వరల్డ్ కప్ మధ్యలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి బీసీసీఐ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ మధ్యలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి బీసీసీఐ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీ తుది దశకు చేరుకుంటోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ ప్రపంచ కప్ ను నిర్వహిస్తోంది. ఎక్కడ ఏ చిన్న సమస్య తెలెత్తకుండా ప్రపంచ దేశాలు అబ్బురపడేలా దిగ్విజయంగా టోర్నీని ముందుకు తీసుకెళ్తోంది. కాగా.. వరల్డ్ కప్ మధ్యలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి బీసీసీఐ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వన్డే వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంటున్న క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ నిర్ణయం అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యం కొరకే తీసుకున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? ఇక నుంచి ఢిల్లీ, ముంబై స్టేడియంలో బాణసంచా కాల్చడంపై తాజాగా నిషేధం విధించింది బీసీసీఐ. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణం తీసుకున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచల కాల్చడం వల్ల వాయు కాలుష్యం మరింతగా పెరిగే అవకాశం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జైషా స్ఫష్టం చేశారు.
ఇక మ్యాచ్ అనంతరం విజయోత్సవంలో భాగంగా కళ్లు మిరుమిట్లు పర్చేలా బాణ సంచాలు కాల్చడం మనకు తెలియనిది కాదు. ఇక నుంచి ముంబై, ఢిల్లీ గ్రౌండ్స్ లో బాణసంచా పేల్చడం కుదరదు. ముంబై, ఢిల్లీల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలుపుతోంది. ఇక్కడ రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. కాగా.. టోర్నీలో వరస విజయాలతో ఉన్న టీమిండియా తన నెక్ట్స్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడబోతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకున్న టీమిండియా.. లంకపై విజయంతో దానిని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. మరి వాయుకాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BCCI bans display of fireworks during the remaining World Cup games in Delhi and Mumbai due to worsening air quality.#ODIWorldCup2023 #ODIWorldCup #Delhi #Mumbai #AirPollution https://t.co/76oaFr2QgC
— editorji (@editorji) November 1, 2023