బ్రేకింగ్‌: ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు భారత జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్‌ ఇన్‌

India vs England 5th Test: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మిగిలి ఉన్న చివరి టెస్టు కోసం భారత సెలెక్టర్లు అప్డేటెడ్‌ స్క్వౌడ్‌ను ప్రకటించారు. మరి అందులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..

India vs England 5th Test: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మిగిలి ఉన్న చివరి టెస్టు కోసం భారత సెలెక్టర్లు అప్డేటెడ్‌ స్క్వౌడ్‌ను ప్రకటించారు. మరి అందులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కాబోయే చివరిదైన ఐదోవ టెస్టు కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. చివరి టెస్టుకు రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇస్తారనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చేలా టీమ్‌ను ప్రకటించింది. చివరి టెస్ట్‌ కోసం ప్రకటించిన జట్టులో కూడా రోహిత్‌ శర్మ ఉన్నాడు. అయితే.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. మూడు, నాలుగో టెస్టులో ఆడిన జట్టునే దాదాపు చివరి టెస్టులో కూడా కొనసాగించారు. కేవలం ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. నాలుగో టెస్టుకు దూరమైన టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. చివరి టెస్ట్‌ కోసం తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను టీమ్‌ నుంచి రిలీజ్‌ చేశారు. దీంతో అతను రంజీ ట్రోఫీలో తన రాష్ట్ర జట్టు తమిళనాడు తరఫున బరిలోకి దిగనున్నాడు.

అలాగే కేఎల్‌ రాహుల్‌, మొహమ్మద్‌ షమీ గాయాలపై కూడా బీసీసీఐ అప్డేట్‌ ఇచ్చింది. రాహుల్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతన్ని తమ ఫిట్‌నెస్‌ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. అలాగే స్టార్‌ పేసర్‌ షమీ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది. తర్వలోనే షమీని బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి తరలిస్తామని తెలిపింది. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ.. అద్భుతంగా పుంజుకున్న భారత్‌.. వరుసగా మూడు విజయాలు సాధించి, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. విశాఖ, రాజ్‌కోట్‌, రాంచీ మూడు వేదికల్లోనూ టీమిండియానే విజయ ఢంకా మోగించింది. ఇక మిగిలిన చివరి టెస్టుకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఉన్నారు. మరి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులతో రోహిత్‌ సేన చివరి టెస్టులో బరిలోకి దిగుతుందో చూడాలి. మరి ఈ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం​లో తెలియజేయండి.

Show comments