P Venkatesh
మైదానంలో బ్యాట్స్ మెన్స్ మధ్య ఘర్షన చోటుచేసుకుంది. అసహనంతో ఒకరిపై ఒకరు బ్యాట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా నెట్టింటా వైరల్ గా మారింది.
మైదానంలో బ్యాట్స్ మెన్స్ మధ్య ఘర్షన చోటుచేసుకుంది. అసహనంతో ఒకరిపై ఒకరు బ్యాట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా నెట్టింటా వైరల్ గా మారింది.
P Venkatesh
క్రికెట్ కు ఉండే ఆధరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు గల్లీలల్లో, గ్రౌండ్ లల్లో క్రికెట్ ఆడేస్తుంటరు. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వన్డే వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు కావాల్సిన వినోదాన్ని పంచుతూ ఫుల్ జోష్ నింపేస్తోంది. అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సర్వసాధారణం. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా పాకిస్తాన్ లో బ్యాట్స్ మెన్ ల మధ్య జరిగిన ఫైటింగ్ వైరల్ గా మారింది. ఇద్దరు బ్యాట్స్ మెన్ లు ఒకరిపై ఒకరు బ్యాట్ తో కొట్టుకున్నరు. గ్రౌండ్ లోనే దాడి చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఘర్ కే కాలేష్ అనే ఎక్స్ యూజర్ బ్యాట్స్ మెన్స్ దాడి చేసుకున్న వీడియోను పోస్టు చేశారు. పాకిస్తాన్ లో జరిగిన ఓ టోర్నమెంట్ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు కొట్టుకున్నరు. సాధారణంగా క్రికెట్ లో గొడవలు జరిగితే ప్రత్యర్థి టీమ్ తో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే జట్టు బ్యాట్స్ మెన్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇంతకీ గొడవకు కారణం ఏంటంటే.. క్రీజులో ఉన్న బ్యాటర్ బంతిని కొట్టగా అది ఎక్కువ దూరం వెల్లలేదు. దీంతో ఆ బ్యాటర్ రన్ కోసం ప్రయత్నించలేదు. కానీ నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ మాత్రం రన్ కోసం పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు ఫీల్డర్లు రనౌట్ చేశారు.
వద్దని వారిస్తున్నా ఎందుకు వచ్చావని స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ అంటాడు. దాంతో తన సహచర ఆడగాడిపై కోపంతో తిట్టుకుంటూ బయటికి వెళ్లిపోతుంటాడు. అయితే ఉన్నట్టుండి క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ పరుగెత్తుకుంటూ వచ్చి తన తోటి బ్యాట్స్‌మెన్‌పై బ్యాట్ తో దాడి చేస్తాడు. ఒకరిపై ఒకరు కలబడి కొట్టేసుకుంటుంటారు. అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు, టోర్నమెంట్ నిర్వాహకులు కలుగ జేసుకుని వారిని ఆపుతారు. ఈ దాడిని చూసిన కొందరు ఇలా కొట్టుకోవడమేంట్రా బాబు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి నిష్క్రమించింది. పేలవమైన ప్రదర్శనతో జట్టు ఇంటిదారి పట్టింది.
Kalesh b/w Two players of the same team during cricket match over Run-out in Pakistan pic.twitter.com/tKqdlOnq2R
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 11, 2023