iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్​లో ఇంతకంటే చెత్త ఫీల్డింగ్ చూసుండరు.. వీళ్ల కంటే పాకిస్థాన్ నయం!

  • Published May 10, 2024 | 9:52 PM Updated Updated May 10, 2024 | 9:52 PM

క్రికెట్​లో చెత్త ఫీల్డింగ్ అనగానే వెంటనే పాకిస్థాన్ గుర్తుకొస్తుంది. కానీ ఆ టీమ్​ను కూడా దాటేసి వరస్ట్ ఫీల్డింగ్​తో విసుగుపుట్టించిందో జట్టు.

క్రికెట్​లో చెత్త ఫీల్డింగ్ అనగానే వెంటనే పాకిస్థాన్ గుర్తుకొస్తుంది. కానీ ఆ టీమ్​ను కూడా దాటేసి వరస్ట్ ఫీల్డింగ్​తో విసుగుపుట్టించిందో జట్టు.

  • Published May 10, 2024 | 9:52 PMUpdated May 10, 2024 | 9:52 PM
వీడియో: క్రికెట్​లో ఇంతకంటే చెత్త ఫీల్డింగ్ చూసుండరు.. వీళ్ల కంటే పాకిస్థాన్ నయం!

క్రికెట్​లో బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​ కూడా చాలా ముఖ్యం. బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్​తో టీమ్స్ మ్యాచులు గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఫీల్డర్లు జట్టులో ఉంటే పరుగులు కాపాడటంతో పాటు బ్యాటర్లను కూడా ఔట్ చేయొచ్చు. అందుకే క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్​లో బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి జట్టూ తమ ఫీల్డింగ్​ను మెరుగుపర్చుకోవడం మీద పని చేస్తోంది. అయినా కొన్ని టీమ్స్ తీరు మారడం లేదు. చెత్త ఫీల్డింగ్​తో ఇంకా పరువు తీసుకుంటున్నాయి. వరస్ట్ ఫీల్డింగ్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్. కానీ అలాంటి దాయాది జట్టునే మించిపోయిందో టీమ్.

చెత్త ఫీల్డింగ్​తో పరువు పోగొట్టుకుందో టీమ్. ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఉండే ఫీల్డింగ్ ఇదేనా అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ జట్టే జింబాబ్వే. బంగ్లాదేశ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో వరస్ట్ ఫీల్డింగ్​తో వార్తల్లోకి ఎక్కింది జింబాబ్వే. సాధారణంగా చెత్త ఫీల్డింగ్ అంటే ఎవరైనా పాక్ గురించే మాట్లాడుకుంటారు. ఆ టీమ్ ప్లేయర్ల ఫీల్డింగ్ విన్యాసాలు అలా ఉంటాయి. ఈజీ క్యాచ్​ను నేలపాలు చేయడం, చేతితో ఆపాల్సిన బంతుల్ని కాళ్లతో ఆపి బౌండరీలకు పంపడం లాంటివి వాళ్లకు మాత్రమే సాధ్యం. కానీ జింబాబ్వే ఆటగాళ్లు వాళ్ల నుంచి స్ఫూర్తి పొందారో ఏమో.. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో బాల్ పట్టడమే రాదన్నట్లు బిహేవ్ చేశారు.

బంగ్లాతో మ్యాచ్​లో వికెట్లకు దగ్గరగా పడిన బంతిని అందుకున్న ఓ జింబాబ్వే పేసర్ బ్యాటర్​ను రనౌట్ చేద్దామనుకొని గట్టిగా త్రో చేశాడు. కానీ వికెట్లకు తగల్లేదు. దాన్ని అందుకున్న బ్యాకప్ ఫీల్డర్ ఆ బాల్​ను బౌలింగ్​ ఎండ్ వైపు విసిరాడు. ఇక్కడ బాల్ అందుకున్న ఫీల్డర్ కళ్ల ఎదుటే వికెట్లు ఉన్నా వాటిని హిట్ చేయలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ వీళ్ల కంటే పాక్ ప్లేయర్లు నయం అని కామెంట్స్ చేస్తున్నారు. గల్లీ ఆటగాళ్ల కంటే దారుణంగా ఉన్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి.. జింబాబ్వే ఫీల్డింగ్ విన్యాసాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.