iDreamPost
android-app
ios-app

ఆసియా కప్‌ కోసం నిప్పులపై నడిచాడు! తీరా చూస్తే ఇలా..

  • Published Sep 07, 2023 | 2:19 PM Updated Updated Sep 07, 2023 | 2:19 PM
  • Published Sep 07, 2023 | 2:19 PMUpdated Sep 07, 2023 | 2:19 PM
ఆసియా కప్‌ కోసం నిప్పులపై నడిచాడు! తీరా చూస్తే ఇలా..

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ నయీమ్‌ ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు ప్రిపరేషన్‌లో భాగంగా నిప్పులపై నడిచాడు. మ్యాచ్‌లు ఆడుతున్న సమయాల్లో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు మానసికంగా మరింత దృఢంగా మారేందుకు నయీమ్‌ తన మెంటల్‌ బ్యాలెన్స్‌ కోచ్‌ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు మరింత ధైర్యంగా ఆడేందుకు కోసం, తనలో ఉన్న భయాన్ని పొగొట్టుకునేందుకు నిప్పులపై కూడా నడిచాడు. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు నయీమ్‌ నిప్పులుపై నడిచిన విషయం సంచలనంగా మారింది. గతంలో ఏ క్రికెటర్‌ కూడా ఇలాంటి శిక్షణ తీసుకోలేదు. తొలి సారి నయీమ్‌ ఇలా చేయడంతో వైరల్‌గా మారింది.

ఇక ఆసియా కప్‌లో నయీమ్‌ అద్భుతంగా రాణిస్తాడని అంతా భావించారు. కానీ, తీరా టోర్నీ ప్రారంభమై.. మూడు మ్యాచ్‌లు ముగిసినా.. ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసిన నయీమ్‌.. అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 28 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడి, అఫ్ఘనిస్థాన్‌పై గెలిచి సూపర్‌ 4కు చేరింది. సూపర్‌ 4లో భాగంగా బుధవారం పాకిస్థాన్‌తో లాహోర్‌లోని గడాఫీ క్రికెట్‌ స్టేడియంలో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లోనూ నయీమ్‌ విఫలం అయ్యాడు. 25 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసి.. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన నయీమ్‌పై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. ఈ మాత్రం దానికి నిప్పులపై నడుస్తూ అంత షో చేయాలా? దాని బదులు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తే బాగుండేది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా.. బంగ్లాదేశ్‌ సూపర్‌ 4లో 9న శ్రీలంకతో అలాగే 15న ఇండియాతో ఆడనుంది. మరి ఈ రెండు మ్యాచ్‌ల్లో నయీమ్‌ ఎలా ఆడతాడో చూడాలి. మరి నయీమ్‌ నిప్పులపై నడవడం, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌: సొంత మైదానంలో పరువుపోగొట్టుకున్న పాకిస్థాన్‌