iDreamPost

ఆసియా కప్‌: సొంత మైదానంలో పరువుపోగొట్టుకున్న పాకిస్థాన్‌

  • Published Sep 07, 2023 | 1:36 PMUpdated Sep 07, 2023 | 1:36 PM
  • Published Sep 07, 2023 | 1:36 PMUpdated Sep 07, 2023 | 1:36 PM
ఆసియా కప్‌: సొంత మైదానంలో పరువుపోగొట్టుకున్న పాకిస్థాన్‌

ఆసియా కప్‌ 2023 టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనూ, మరికొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతున్నాయి. టీమిండియాను పాకిస్థాన్‌ పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. అయితే.. శ్రీలంకలో వర్షాలతో మ్యాచ్‌లు సరిగా జరగకపోవడంపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లు వర్షాల అంతరాయం లేకుండా బాగా జరుగుతుండటంపై కొంతమంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, బుధవారం బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌తో పాకిస్థాన్‌ పరువుపోగొట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోర్‌కే ఆలౌట్‌ అయింది. కేవలం 193 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఈజీ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. నిదానంగా ఆడింది. పిచ్‌ నుంచి స్వింగ్‌ లభిస్తుండటంతో బంగ్లాదేశ్‌ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేశారు. దాంతో పాకిస్థాన్‌ 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా కేవలం 15 పరుగులు మాత్రమే చేసింది. ఈ సమయంలో లాహోర్‌ స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లు ఆగిపోయాయి. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దాదాపు 15, 20 నిమిషాల తర్వాత ఫ్లడ్‌ లైట్లు వెలగడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభం అయింది. సాంకేతిక లోపం కారణంగా ఫ్లడ్‌ లైట్లు ఆఫ్‌ కావడంతో కొంతసేపు గ్రౌండ్‌లో మొత్తం చీకటి ‍కమ్ముకుంది. ప్రేక్షకులంతా ఫోన్ల టార్చ్‌ లైట్లు ఆన్‌ చేసుకున్నారు.

ఇలా ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహిస్తూ.. ఫ్లడ్‌ లైట్లను ముందుగా చెక్‌ చేసుకోకుండా ఉంటారా అంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. పైగా లాహోర్‌ గ్రౌండ్‌ హౌజ్‌ ఫుల్‌ కావడంతో ప్రేక్షకులతో స్టేడియం కిటకిటలాడిపోయింది. కానీ, సరైన మెయింటెన్స్‌ లేకపోవడంతో పాకిస్థాన్‌ పరువు సొంతం మైదానంలో పోయిందని కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 7 వికెట్లతో విజయం సాధించింది. 194 పరుగుల టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌(78), మొహమ్మద్‌ రిజ్వాన్‌(63) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. మరి లాహోర్‌ గ్రౌండ్‌లో ఫ్లడ్‌ లైట్లు ఆగిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టాలెంట్‌ లేదు.. లక్కీగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్నాడు! సూర్యపై షాకింగ్‌ కామెంట్స్‌..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి