P Venkatesh
క్రికెట్ లో ఉన్న నియమ నిబంధనలు ప్రతి ఒక్క ఆటగాడు తెలుసుకోని ఫాలో కావాల్సిందే. లేదంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే అన్నీ తెలిసి కూడా లంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ చిన్న తప్పిదంతో తను ఔటయ్యాడు.
క్రికెట్ లో ఉన్న నియమ నిబంధనలు ప్రతి ఒక్క ఆటగాడు తెలుసుకోని ఫాలో కావాల్సిందే. లేదంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే అన్నీ తెలిసి కూడా లంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ చిన్న తప్పిదంతో తను ఔటయ్యాడు.
P Venkatesh
వన్డే ప్రపంచకప్ లో ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా ముందుగా బౌలింగ్ ఎంచుకుని శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లంక 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. ఇంతకీ ఏం జరిగిందంటే? శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ డగౌటన్ నుంచి క్రీజులోకి సమయానికి రానందున అంపైర్ మాథ్యూస్ ను ఔట్ గా ప్రకటించాడు. దీంతో అతడు బ్యాటింగ్ చేయకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
క్రికెట్ లో ఉన్న నియమ నిబంధనలు ప్రతి ఒక్క ఆటగాడు తెలుసుకోని ఫాలో కావాల్సిందే. లేదంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే అన్నీ తెలిసి కూడా లంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ చిన్న తప్పిదంతో తను ఔటయ్యాడు. అసలు దీనికి గల కారణం ఏంటంటే? మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాట్స్ మెన్ ఔటైనపుడు, మరో ఆటగాడు 120 సెకన్లల్లో క్రీజలోకి వచ్చి ఆటకు సిద్ధంగా ఉండాలి. అలా లేని పక్షంలో క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ గా ప్రకటిస్తాడు. సరిగ్గా శ్రీలంక, బంగ్లా మ్యాచ్ లో ఇదే జరిగింది. టైమ్ అవుట్ కారణంగా మాథ్యూస్ ఔటయ్యాడు.
డగౌట్ లో ఉన్న మాథ్యూస్ క్రిజులోకి వచ్చే ముందు హెల్మెట్ మర్చిపోయి గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. అనంతరం మళ్లీ హెల్మెట్ కోసం డగౌట్ కి పరుగెత్తాడు. ఈ లోపు టైమ్ అయిపోయింది. దీంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ మాథ్యూస్ ను ఔట్ గా ప్రకటించాడు. అయితే మాథ్యూస్ తను బ్యాటింగ్ కు రావడానికి ఆలస్యం ఎందుకైందో షకీబ్ కు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ బంగ్లా జట్టు అందుకు అంగీకరించలదు. వారి అప్పీల్ ను వెనక్కి తీసుకోలేదు. దీంతో మాథ్యూస్ ఔటవ్వక తప్పలేదు. ఇలా టైమ్ ఔట్ కారణంగా ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఈ విధంగా ఔట్ కాలేదు.
🏏😔THIS is FIRST TIME in INTERNATIONAL CRICKET.
Bangladesh appealed against Angelo Mathews for timeout and he was given out. #SLvsBAN #BANvsSL #CWC23 pic.twitter.com/Dw7KBCdQN0
— 🇮🇳Bhanu (@singh_bhan33431) November 6, 2023