iDreamPost
android-app
ios-app

VIDEO: బాబర్‌ మైండ్‌బ్లాక్‌ అయ్యేలా చేసిన టీమిండియా బౌలర్లు!

VIDEO: బాబర్‌ మైండ్‌బ్లాక్‌ అయ్యేలా చేసిన టీమిండియా బౌలర్లు!

ఆసియా కప్‌ 2023లో భాగంగా సూపర్‌ 4 స్టేజ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత టీమిండియా టాపార్డర్‌ చెలరేగి.. పాక్‌ బౌలర్లును ఊచకోత కోయగా.. తర్వాత భారత బౌలర్లు పాక్‌ బ్యాటర్ల పనిపట్టారు. మొత్తంగా చిరకాల ప్రత్యర్థిపై 228 పరుగులు భారీ తేడాతో టీమిండియా గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అవుటైన విధానం హైలెట్‌గా మారింది. తొలుత బుమ్రా వేస్తున్న స్వింగ్‌కు బెంబేలెత్తిపోయాడు బాబర్‌. బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత.. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా 9 బంతులు ఎదుర్కొన్న బాబర్‌.. ఒక్క రన్‌ కూడా చేయలేకపోయాడు సరికదా.. కనీసం టచ్‌ చేయడానికి కూడా వణికిపోయాడు.

బుమ్రా పెట్టిన భయానికి.. హార్దిక్‌ పాండ్యాకు ఫలితం దక్కింది. బుమ్రా స్వింగ్‌ చూసి భయపడిన బాబర్‌.. తీవ్ర ఒత్తిడిలో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేసే క్రమంలో.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో దొరికిపోయాడు. పాండ్యా వేసిన సూపర్‌ డెలవరీ.. బాబర్‌ బ్యాట్‌, ప్యాట్‌ మధ్య నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. పాండ్యా వేసిన సూపర్‌ డెలవరీకి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అయిన బాబర్‌ అజమ్‌ కళ్లుతేలేశాడు. అసలు బాల్‌ ఎలా పడి ఎలా వచ్చింది.. ఈ బాల్‌ని ఎలా ఆడాలి అన్నట్లు అలాగే చూస్తుండిపోయాడు. చేసేదేమీ లేక.. పెవిలియన్‌ బాటపడ్డాడు.

అయితే.. ఇప్పుడే కాదు. గతంలో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనూ బాబర్‌ అజమ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మ్యధ్య జరిగిన మ్యాచ్‌లో.. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన బాల్‌ను సూపర్‌ డెలవరీ.. బాబర్‌ బ్యాట్‌, ప్యాట్‌ మధ్య నుంచి అలా దూసుకెల్లి స్టంప్స్‌ను పడగొట్టింది. అప్పుడు కూడా బాబర్‌ అజమ్‌ సేమ్‌ రియాక్షన్స్‌ ఇచ్చాడు. ఇలా రెండు సార్లు టీమిండియా బౌలర్ల సూపర్‌ డెలవరీలకు బాబర్‌ అజమ్‌ అవుటైన వీడియోలను షేర్‌ చేస్తూ.. ‘నువ్వెలా వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అయ్యావ్‌?’ అంటూ.. నెటిజన్లు బాబర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి