వీడియో: రిజ్వాన్ పరువు తీసిన బాబర్! చెత్త ప్లేయర్ అంటూ..

Babar Azam, Mohammad Rizwan: బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్.. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్​కు కలసి ఆడుతున్నారు. వీళ్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీళ్లు గుడ్ ఫ్రెండ్స్ కూడా. కానీ రిజ్వాన్ పరువు తీశాడు బాబర్.

Babar Azam, Mohammad Rizwan: బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్.. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్​కు కలసి ఆడుతున్నారు. వీళ్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీళ్లు గుడ్ ఫ్రెండ్స్ కూడా. కానీ రిజ్వాన్ పరువు తీశాడు బాబర్.

ఏ టీమ్ ప్లేయర్స్ అయినా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఒకర్నొకరు పుష్ చేసుకుంటూ తమలోని బెస్ట్​ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. అవతలి జట్టు ఆటగాళ్లను తమ టీమ్​మేట్స్​ను ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. ఎదురెళ్లి స్లెడ్జింగ్ చేస్తారు. అలా తమ ఫ్రెండ్​షిప్​ను బెటర్ చేసుకుంటారు. ఇది టీమ్​కు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే దాయాది పాకిస్థాన్ ప్లేయర్లు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. టీమ్​లోనే గ్రూపులు కట్టడం, నేను తోపంటే నేను తోపంటూ బిహేవ్ చేయడం, ఒకరి పరువు మరొకరు తీసుకోవడం లాంటివి ఆ జట్టులో తరచూ కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పరువు తీశాడు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం. చెత్త ప్లేయర్ అంటూ అవమానించాడు. అసలు అతడు అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్ ట్రెయినింగ్ సెషన్స్​లో భాగంగా బాబర్-రిజ్వాన్ మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇందులో బాబర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతడికి కోచింగ్ స్టాఫ్​ బంతులు వేశారు. రిజ్వాన్ వికెట్ల వెనుక ఉండి బంతులు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఓ బంతిని బాబర్ ఆడేందుకు ట్రై చేయగా.. అది కాస్తా వైడ్​గా వెళ్లింది. అయితే వికెట్ల వెనుక ఉన్న రిజ్వాన్ దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో బాబర్.. ఇతడో చెత్త కీపర్, నకిలీ కీపర్ అంటూ సరదా కామెంట్స్ చేశాడు. బాబర్ అలా పరువు తీసినా రిజ్వాన్ దాన్ని లైట్ తీసుకున్నాడు. బాల్ పట్టుకొని తిరిగి బౌలింగ్ ఎండ్ వైపు విసిరాడు. బాబర్ మాత్రం అతడికి కీపింగ్ రాదంటూ ఎగతాళి చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

బాబర్-రిజ్వాన్ వీడియో చూసిన నెటిజన్స్.. ఇలాంటివి మీకే సాధ్యమని అంటున్నారు. మీ పరువు వేరే వాళ్లు తీయనక్కర్లేదు, మీరే తీసుకుంటారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అదేం కీపింగ్ రా నాయనా, ఆ బాల్ కూడా పట్టలేరా అని సెటైర్స్ వేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం ఏదో సరదాగా కామెంట్ చేశాడు.. వదిలేయండని చెబుతున్నారు. ఇక, పాక్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సంక్షోభంలో ఉందనే చెప్పాలి. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్​లో గ్రూప్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టిన దాయాది జట్టు.. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్నది. సొంతగడ్డపై ఆడుతూ బంగ్లా చేతుల్లో వైట్​వాష్ అయింది. దీంతో ఇంటా బయటా ఆ టీమ్ విమర్శల పాలవుతోంది. అటు జట్టులో సఖ్యత లేకపోవడం, ఆటగాళ్ల మధ్య విభేదాలు, గ్రూపులు కట్టడం, పెర్ఫార్మెన్స్​ పడిపోవడం, వరుస ఓటములతో ఆ టీమ్ సతమతమవుతోంది. దీని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. మరి.. బాబర్-రిజ్వాన్ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments