iDreamPost
android-app
ios-app

Riyan Parag: వీడియో: రియాన్ పరాగ్ స్టన్నింగ్ సిక్స్.. ఇది పక్కా చూడాల్సిన షాట్!

  • Published Sep 12, 2024 | 12:54 PM Updated Updated Sep 12, 2024 | 12:54 PM

Riyan Parag, Duleep Trophy 2024, IND A vs IND D: టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్​తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది.

Riyan Parag, Duleep Trophy 2024, IND A vs IND D: టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్​తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది.

  • Published Sep 12, 2024 | 12:54 PMUpdated Sep 12, 2024 | 12:54 PM
Riyan Parag: వీడియో: రియాన్ పరాగ్ స్టన్నింగ్ సిక్స్.. ఇది పక్కా చూడాల్సిన షాట్!

టీమిండియా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రీజులో నిలదొక్కుకుంటే ఎలా ఆడతాడో తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా బ్యాట్​తో విధ్వంసం సృష్టించడం అతడికి అలవాటుగా మారింది. సాలిడ్ డిఫెన్స్​తో పాటు అంతే అగ్రెసివ్ అప్రోచ్​తో ఆడుతుంటాడు పరాగ్. దులీప్ ట్రోఫీ-2024లో మరో మంచి నాక్ ఆడాడతను. ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన పరాగ్ ధనాధన్ బ్యాటింగ్​తో అలరించాడు. క్రీజులో ఉన్నంత సేపు బాదుడే బాదుడు అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది. అతడు కొట్టిన ఓ షాట్ అయితే ఇన్నింగ్స్​కే హైలైట్​గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్​లో కావేరప్ప బౌలింగ్​లో పరాగ్ స్టన్నింగ్ సిక్స్​తో అలరించాడు.

5 ఓవర్లలో 2 వికెట్లు తీసి మంచి ఊపు మీదున్న కావేరప్పకు పరాగ్ షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్​లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. డీప్ కవర్ మీదుగా అతడు కొట్టిన సిక్స్ అద్భుతమనే చెప్పాలి. గుడ్​ లెంగ్త్​లో పడిన బంతిని ముందే అంచనా వేసిన పరాగ్.. అది పడగానే దాన్ని పికప్ చేసుకున్నాడు. క్రీజులో నిల్చున్న చోటు నుంచే డీప్ కవర్స్ మీదుగా భారీ షాట్​గా మలిచాడు. బాల్ వేగం, పరాగ్ టైమింగ్​కు అది చాలా ఎత్తులో వెళ్లి దూరంగా పడింది. షాట్ కొట్టిన టైమ్​లో పరాగ్ హెడ్, బాడీ మూమెంట్ పర్ఫెక్ట్​గా ఉన్నాయి. అందుకే ఇంచు కూడా కదలకుండా ఉన్న చోటు నుంచి కొడితే ఎక్కడో స్టేడియం పైకప్పు మీద వెళ్లి పడింది బంతి. చక్కటి టైమింగ్​తో షాట్​ను పరాగ్ కనెక్ట్ చేసిన విధానం హైలైట్​గా నిలిచింది.

మొత్తంగా 29 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 37 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ ఉంది. ఉన్నంత సేపు బిగ్ షాట్స్​తో అలరించిన పరాగ్ ఔట్ అయ్యాక ఇండియా ఏ మరింత ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ, శాశ్వత్ రావత్ ఔట్ అయ్యారు. ఇండియా ఏ టీమ్ ప్రస్తుతం 31 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 115 పరుగులతో ఉంది. టాప్ బ్యాటర్స్ అంతా ఫెయిల్ అయ్యారు. పరాగ్ ఒక్కడే బాగా ఆడాడు. అతడు కూడా దొరికిన మంచిన స్టార్ట్​ను అదే రీతిలో కంటిన్యూ చేస్తూ పోతే ఇండియా ఏకు భారీ స్కోరు ఆశలు ఉండేవి. కుమార్ కుశాగ్ర (19 నాటౌట్), షామ్స్ ములానీ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాని మీదే ఇండియా ఏ టీమ్ భారీ స్కోరు ఛాన్సెస్ డిపెండ్ అవుతాయి. మరి.. పరాగ్ క్లాసికల్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.