iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియా విన్నింగ్ ట్రోఫీపై ట్రోల్స్! దీని కంటే టీ కప్పు నయమంటూ..

  • Published Sep 09, 2024 | 9:36 PM Updated Updated Sep 09, 2024 | 9:36 PM

AUS vs SCO: పసికూన స్కాట్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. వరుసగా మూడు మ్యాచుల్లో నెగ్గి ప్రత్యర్థి జట్టును వైట్​వాష్ చేసింది ఆసీస్. అయితే విక్టరీ కంటే ఆ జట్టు నెగ్గిన ట్రోఫీ సైజ్​పై ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి.

AUS vs SCO: పసికూన స్కాట్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. వరుసగా మూడు మ్యాచుల్లో నెగ్గి ప్రత్యర్థి జట్టును వైట్​వాష్ చేసింది ఆసీస్. అయితే విక్టరీ కంటే ఆ జట్టు నెగ్గిన ట్రోఫీ సైజ్​పై ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి.

  • Published Sep 09, 2024 | 9:36 PMUpdated Sep 09, 2024 | 9:36 PM
ఆస్ట్రేలియా విన్నింగ్ ట్రోఫీపై ట్రోల్స్! దీని కంటే టీ కప్పు నయమంటూ..

బిగ్ టీమ్స్​ మీదే చెలరేగిపోతుంటుంది ఆస్ట్రేలియా. ఎంత పెద్ద జట్టు ఎదురుపడితే అంత భారీ విజయం సాధించాలని చూస్తుంది. కాంపిటీటర్ ఎంత స్ట్రాంగ్​గా ఉంటే, మ్యాచ్ సిచ్యువేషన్స్ ఎంత కఠినంగా ఉంటే ఆసీస్ ఆటగాళ్లు అంత బెస్ట్ ఔట్​పుట్ ఇస్తారు. తమ బెస్ట్​ను బయటకు తీసి ప్రత్యర్థులను చావగొడతారు. అలాంటిది పసికూనతో మ్యాచ్ అంటే ఊరుకుంటారా? పిప్పి చేసేస్తారు. స్కాట్లాండ్​ను ఇలాగే చిత్తు చిత్తుగా ఓడించారు. మూడు టీ20ల సిరీస్​లో ఆ టీమ్​ను వైట్​వాష్ చేశారు. ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా మట్టికరిపించారు. అయితే సిరీస్ విక్టరీ కంటే కూడా ఆసీస్ గెలుచుకున్న ట్రోఫీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంగారూ విన్నింగ్ ట్రోఫీ మీద ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి. దీని కంటే టీ కప్పు నయమంటూ విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

స్కాట్లాండ్​పై సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియాకు ఓ ట్రోఫీ ఇచ్చారు. వరుస మ్యాచుల్లో నెగ్గడం, ఆటగాళ్లంతా రాణించడం, సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయడంతో కంగారూ ప్లేయర్లంతా ఈ విజయాన్ని ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోఫీని చేతబట్టి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిని చూసిన నెటిజన్స్ ఆసీస్​ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆ జట్టు గెలిచిన ట్రోఫీ టీ కప్పు సైజులో ఉండటమే. సాధారణంగా క్రికెట్​లో చిన్న టోర్నీ అయినా సరే భారీ సైజులో ఉన్న ట్రోఫీలో ఇస్తారు. చిన్న సైజులో అంటే యాషెస్ ట్రోఫీ తప్ప ఏదీ ఇవ్వరు. అయితే ఆ సిరీస్​కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా దాన్ని అందుకోవడం గొప్ప అని అంతా భావిస్తారు. దానికో చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఆసీస్​కు మాత్రం టీ కప్పు సైజులో జల్లెడను పోలిన ట్రోఫీ ఇవ్వడం మీమ్స్ మెటీరియల్​గా మారింది.

ఇది ట్రోఫీనా? టీ కప్పా? అని ఆసీస్ ట్రోఫీని చూసిన నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ట్రోఫీ రా నాయనా.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోఫీ కోసమేనా రక్తాలు చిందించి ఆడారంటూ సెటైర్స్ వేస్తున్నారు. విన్నింగ్ ట్రోఫీనే ఈ సైజులో ఉంటే ఇంక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చుంటూ ఆడేసుకుంటున్నారు. సిరీస్​ గెలిచినందుకు టీ కప్పు ఇచ్చారు.. మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​గా చెంచాలు ఇచ్చినట్లున్నారని కామెంట్స్ చేస్తున్నారు. స్కాట్లాండ్ జట్టు సిరీస్ ఓడినందుకు ఆస్ట్రేలియాను బాగా బుక్ చేసిందని జోకులు వేసుకుంటున్నారు. ఈ ట్రోఫీ అమ్మితే టీ కప్పు కూడా రాదు.. పాపం ఆసీస్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సిరీస్ కంటే ట్రోఫీ బాగా హైలైట్ అయిందనే చెప్పాలి. మరి.. ఆసీస్ విన్నింగ్ ట్రోఫీపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.