iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆ లెటర్​ చూసి భయపడ్డా.. అభిమాని లేఖపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Sep 09, 2024 | 6:55 PM Updated Updated Sep 09, 2024 | 6:55 PM

Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేనికీ భయపడడు. ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడుతుంటాడు. ఎంత తోపు బౌలర్​నైనా ఉతికి ఆరేస్తాడు. అలాంటోడు ఓ అభిమాని రాసిన లెటర్ చూసి భయపడ్డాడట.

Virat Kohli, Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేనికీ భయపడడు. ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడుతుంటాడు. ఎంత తోపు బౌలర్​నైనా ఉతికి ఆరేస్తాడు. అలాంటోడు ఓ అభిమాని రాసిన లెటర్ చూసి భయపడ్డాడట.

  • Published Sep 09, 2024 | 6:55 PMUpdated Sep 09, 2024 | 6:55 PM
Virat Kohli: ఆ లెటర్​ చూసి భయపడ్డా.. అభిమాని లేఖపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. గ్రౌండ్​లో దిగాడంటే దేనికీ భయపడడు కింగ్. ఫియర్​లెస్ అప్రోచ్​తో ఆడుతుంటాడు. అవతల ఉన్నది ఎంత తోపు బౌలర్ అయినా పట్టించుకోడు. తనదైన స్టైల్​లో వాళ్లను ఉతికి ఆరేస్తాడు. మళ్లీ బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేస్తాడు. ఆన్ ది ఫీల్డే కాదు ఆఫ్ ది ఫీల్డ్ కూడా అతడు తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. అలాంటోడు ఓ అభిమాని రాసిన లెటర్ చూసి భయపడ్డాడట. దాన్ని చూడగానే విరాట్ కాళ్లు, చేతులు వణికాయట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే బయటపెట్టాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టాప్ బ్యాటర్.. క్రేజీ ఫ్యాన్స్ గురించి అడిగిన ప్రశ్నకు పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. ఓ అభిమాని రాసిన లేఖ చూసి తాను షేక్ అయ్యానని అన్నాడు. ఇంకా విరాట్ ఏమన్నాడంటే..

ఒక అభిమాని పంపిన లెటర్ చూసి వణికిపోయానన్న కోహ్లీ.. అది మామూలుది కాదన్నాడు. ఎవరో రక్తంతో ఆ లేఖను రాశారని.. దాన్ని చూసి తాను భయపడ్డానని చెప్పాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆ లెటర్​ను తన కారులో విసిరి వెళ్లిపోయాడని తెలిపాడు. తన నెత్తురుతో ఆ లేఖ రాశానని అందులో ఆ వ్యక్తి తెలియజేయడంతో తాను షాక్​కు గురయ్యానని పేర్కొన్నాడు కోహ్లీ. బ్లడ్​తో లెటర్ రాయడం అతిగా అనిపించిందన్నాడు. అలాంటివి తనకు ఇష్టం ఉండదని, అదో విచిత్రమైన ఘటన అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. తాను ఇప్పటివరకు ఎక్స్​పీరియెన్స్ చేసిన వాటిల్లో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదో కూడా అతడు రివీల్ చేశాడు. అది వన్డే వరల్డ్ కప్-2019లో చోటు చేసుకుందన్నాడు. ఓ ముసలావిడ తన మీద కురిపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు కింగ్.

ప్రపంచ కప్-2019 టైమ్​లో ఒక ముసలావిడ తమను చూసేందుకు స్టేడియానికి వచ్చిందన్న కోహ్లీ.. ఆమెను కలసిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నాడు. ఆమెను చూడగానే తన నాన్నమ్మను చూసిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఆ మూమెంట్ చాలా స్పెషల్​గా నిలిచిపోయిందన్నాడు. ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇక, బంగ్లాదేశ్ సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో లండన్​కు వెళ్లిపోయాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మతో పాటు పిల్లలు అక్కడే ఉండటంతో వాళ్లతో వెకేషన్​లో బిజీగా ఉన్నాడు. లండన్ వీధుల్లో అనుష్కతో కలసి కోహ్లీ షాపింగ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్​చల్ చేశాయి. అయితే కోహ్లీ బ్యాటింగ్​ చూసేందుకు అభిమానులు ఇంకా ఎక్కువ రోజులు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మరికొన్ని రోజుల్లో అతడు భారత్​కు తిరిగి రానున్నాడు. సెప్టెంబర్ 19న బంగ్లాతో టెస్ట్ సిరీస్​ స్టార్ట్ కానుంది. కాబట్టి విరాట్ త్వరలో స్వదేశానికి పయనం కానున్నాడు. ఇక్కడకు రాగానే టీమ్ ప్రాక్టీస్ క్యాంప్​లో అతడు జాయిన్ అవుతాడు.