iDreamPost

Glenn Maxwell: వీడియో: మ్యాక్స్​వెల్ మెరుపు సెంచరీ.. ఈ సిక్స్ మెయిన్ హైలైట్!

  • Published Feb 11, 2024 | 3:58 PMUpdated Feb 11, 2024 | 3:58 PM

ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ బ్యాట్ నుంచి మరో సంచలన ఇన్నింగ్స్​ వచ్చింది. విండీస్​తో జరుగుతున్న టీ20 మ్యాచ్​లో విధ్వంసక శతకంతో చెలరేగాగాడు మ్యాక్సీ.

ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ బ్యాట్ నుంచి మరో సంచలన ఇన్నింగ్స్​ వచ్చింది. విండీస్​తో జరుగుతున్న టీ20 మ్యాచ్​లో విధ్వంసక శతకంతో చెలరేగాగాడు మ్యాక్సీ.

  • Published Feb 11, 2024 | 3:58 PMUpdated Feb 11, 2024 | 3:58 PM
Glenn Maxwell: వీడియో: మ్యాక్స్​వెల్ మెరుపు సెంచరీ.. ఈ సిక్స్ మెయిన్ హైలైట్!

ప్రస్తుత క్రికెట్​లో డేంజరస్ బ్యాటర్ ఎవరంటే అందరూ చెప్పే పేర్లలో ఒకటి గ్లెన్ మ్యాక్స్​వెల్. క్లాసికల్ షాట్స్, క్రికెట్ బుక్ షాట్స్​కు అతడి దగ్గర చోటు ఉండదు. స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్.. అంటూ వైవిధ్యమైన షాట్లతో బౌలర్లను ఊచకోత కోయడం మ్యాక్స్​వెల్​కు వెన్నతో పెట్టిన విద్య. అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే చాలు.. అవతలి టీమ్ విజయంపై ఆశలు వదిలేసుకుంటుంది. ఎలాంటి మ్యాచ్​ను అయినా సింగిల్ హ్యాండ్​తో తన జట్టు వైపు తిప్పడం మ్యాక్సీకి అలవాటుగా మారింది. అందుకు ఇటీవల వన్డే వరల్డ్ కప్​లో ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్ బిగ్ ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. తాజాగా మరోమారు అతడి బ్యాట్ గర్జించింది. బ్లాస్టింగ్ సెంచరీతో అందర్నీ అలరించాడు మ్యాక్స్​వెల్. అయితే అతడి ఇన్నింగ్స్​లో ఓ సిక్స్ మాత్రం మెయిన్ హైలైట్​గా నిలిచింది.

విండీస్​తో జరుగుతున్న మూడో టీ20లో మ్యాక్స్​వెల్ రెచ్చిపోయి ఆడాడు. 55 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 12 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే దాదాపు 100 పరుగులు చేశాడు మ్యాక్సీ. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్​లో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. తన స్టైల్​లో ఎడాపెడా షాట్లు కొడుతూనే వీలు కుదిరినప్పుడు స్విచ్ షాట్స్, రివర్స్ స్వీప్స్ కూడా బాదాడు మ్యాక్స్​వెల్. ఈ క్రమంలో నిల్చున్న చోటు నుంచే లెగ్ సైడ్ దిశగా ఓ భారీ సిక్స్ బాదాడు. జోసెఫ్ బౌలింగ్​లో అతడు కొట్టిన ఆ బాల్ ఏకంగా 109 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఈ షాట్ చూసిన నెటిజన్స్ ఓడియమ్మ ఇదేం సిక్సు మ్యాక్సీ.. ఇలాంటివి కొట్టడం నీకే సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, తాజా సెంచరీతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల లిస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (5 సెంచరీలు)తో కలసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు మ్యాక్సీ. హిట్​మ్యాన్ కూడా మ్యాక్స్​వెల్​లాగే ఐదు సెంచరీలు బాదాడు. కానీ అందుకు అతడికి 143 ఇన్నింగ్స్​లు పట్టింది. కానీ మ్యాక్సీ కేవలం 94 ఇన్నింగ్స్​ల్లోనే 5 సెంచరీల మార్క్​ను చేరుకున్నాడు. వీళ్లిద్దరి తర్వాతి ప్లేసులో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (57 ఇన్నింగ్స్​ల్లో 4 సెంచరీలు) ఉన్నాడు. కాగా, మ్యాక్స్​వెల్ సుడిగాలి శతకంతో ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన విండీస్ ప్రస్తుతం వికెట్ కోల్పోకుండా 11 పరుగులతో ఉంది. ఆ జట్టు నెగ్గాలంటే 19 ఓవర్లలో ఇంకా 231 పరుగులు చేయాల్సి ఉంది. మరి.. మ్యాక్సీ తుఫాన్ ఇన్నింగ్స్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: బజ్​బాల్ కాదు.. బూమ్​బాలే తోపు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి