iDreamPost

IND vs ENG: బజ్​బాల్ కాదు.. బూమ్​బాలే తోపు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 11, 2024 | 1:16 PMUpdated Feb 11, 2024 | 1:16 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బజ్​బాల్​తో భయం లేదని.. తమ దగ్గర బూమ్​బాల్ ఉందన్నాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బజ్​బాల్​తో భయం లేదని.. తమ దగ్గర బూమ్​బాల్ ఉందన్నాడు.

  • Published Feb 11, 2024 | 1:16 PMUpdated Feb 11, 2024 | 1:16 PM
IND vs ENG: బజ్​బాల్ కాదు.. బూమ్​బాలే తోపు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత పర్యటనకు ఇంగ్లండ్ వస్తోందనగానే క్రికెట్ ప్రపంచం మొత్తం ఇటు వైపు ఆసక్తిగా చూసింది. బజ్​బాల్ ఫార్ములాతో టాప్ టీమ్స్​ను భయపెట్టిన ఇంగ్లీష్ టీమ్ స్పిన్​కు అనుకూలించే ఇండియన్ ట్రాక్స్​పై ఎలా ఆడుతుందోననేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే తొలి టెస్టులో గెలుపుతో సిరీస్​ను ఘనంగా స్టార్ట్ చేసింది ఇంగ్లండ్. బజ్​బాల్​తో రోహిత్ సేనను కట్టిపడేసింది. దీంతో టీమిండియా పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అద్భుతంగా పుంజుకొని 106 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఆ మ్యాచ్​లో 9 వికెట్లు తీసిన పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతడి బంతుల్ని ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బ్యాటర్లు వణికిపోయారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లులు కురిపించాడు.

వైజాగ్ టెస్టులో బుమ్రా అసాధారణంగా బౌలింగ్​ చేశాడని.. అసలు సిసలైన పెర్ఫార్మెన్స్​తో భారత్​ను గెలిపించాడని అశ్విన్ అన్నాడు. బజ్​బాల్​ కాదు.. బూమ్​బాల్ (బుమ్రా) తోపు అని చెప్పాడు. టెస్టు ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ బౌలర్​గా అవతరించిన బుమ్రాకు అశ్విన్ అభినందనలు తెలిపాడు. నంబర్ 1 ర్యాంక్ సాధించడమంటే హిమాలయ శిఖరాన్ని తాకడమేనని.. తాను జస్​ప్రీత్​కు వీరాభిమానినని స్టార్ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్​లో మాట్లాడుతూ అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బూమ్​బాల్​ ముందు ఏదీ పనికిరాదని.. బజ్​బాల్​కు సరైన విరుగుడు అదేనన్నాడు. బుమ్రా బౌలింగ్​తో పాటు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ బ్యాటింగ్ చేసిన తీరునూ అశ్విన్ మెచ్చుకున్నాడు. ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న బ్యాటర్​లా అతడు ఆడాడని కొనియాడాడు.

గిల్ టాలెంట్ మీద ఎలాంటి సందేహం లేదని.. సెంచరీల మీద సెంచరీలు కొట్టే సత్తా అతడికి ఉందన్నాడు అశ్విన్. కాగా, ఈ వెటరన్ స్పిన్నర్ 500 వికెట్ల క్లబ్​లో చేరేందుకు దగ్గర్లో ఉన్నాడు. ఇంకో వికెట్ తీస్తే టెస్టుల్లో ఐదొందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకుంటాడు. రాజ్​కోట్​లో జరిగే మూడో టెస్టులో ఈ మైల్​స్టోన్​ను అతడు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక, సిరీస్​లోని మిగిలిన మూడు టెస్టులకు సెలక్టర్లు టీమ్​ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయంతో బాధపడుతున్న స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ను జట్టులోకి తీసుకోలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల మొత్తం సిరీస్​కు దూరమయ్యాడు. కొత్తగా ఆకాశ్ దీప్ టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి.. బజ్​బాల్​కు బూమ్​బాల్​ సరైన విరుగుడు అని అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: SA20 2024: వీడియో: రెండోసారి ఛాంపియన్స్​గా సన్​రైజర్స్.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి