న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ బాదిన రచిన్.. ఏకంగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ బాదిన రచిన్.. ఏకంగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
రచిన్ రవీంద్ర.. వన్డే వరల్డ్ కప్-2023లో బాగా మార్మోగుతున్న పేర్లలో ఒకటి. 23 ఏళ్ల ఈ డాషింగ్ లెఫ్టాండర్ తన బ్యాట్‌తో చేస్తున్న మ్యాజిక్ అంతా ఇంతా కాదు. వరుసగా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు రచిన్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 96 బంతుల్లో 123 రన్స్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడీ యంగ్ ఆల్‌రౌండర్. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లోనూ 87 బంతుల్లో 75 రన్స్ చేసి తన సత్తాను మరోమారు ప్రూవ్ చేశాడు రచిన్.
ధర్మశాల వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు రచిన్ రవీంద్ర. ఈ మ్యాచ్‌లో 89 బంతుల్లో ఏకంగా 116 రన్స్ చేశాడు. రచిన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లపై పూర్తిగా అతడి డామినేషన్ సాగింది. డారిల్ మిచెల్ (54)తో కలసి కివీస్ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించాడు రచిన్. అయితే అతడు ఔటవ్వడంతో ఛేదనలో న్యూజిలాండ్ వెనుక పడింది. ఈ సెంచరీ ద్వారా రచిన్ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసులో వరల్డ్ కప్‌లో 2 సెంచరీలు బాదిన టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరసన అతడు చోటు సంపాదించాడు.
ఒకవేళ మెగాటోర్నీలో మరో సెంచరీ కొడితే లిటిల్ మాస్టర్ రికార్డును రచిన్ బ్రేక్ చేసినట్లవుతుంది. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 388 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ టీమ్‌లో డేవిడ్ వార్నర్ (81), ట్రావిస్ హెడ్ (109) అద్భుతంగా రాణించారు. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్‌కు ఏకంగా 175 రన్స్ జోడించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ (36), మ్యాక్స్‌వెల్ (41), ఇంగ్లిస్ (38) విలువైన పరుగులు చేశారు. ఆఖర్లో ప్యాట్ కమిన్స్ (37) బ్యాట్ ఝళిపించడంతో కంగారూ టీమ్ దాదాపుగా నాలుగొందల స్కోరుకు దగ్గరగా వచ్చి ఆగింది. ఛేజింగ్‌కు దిగిన కివీస్ ప్రస్తుత స్కోరు 49 ఓవర్లకు 370. జేమ్స్ నీషమ్ (51 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. రచిన్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: పాక్ ఓటమిపై భజ్జీ అసహనం! తప్పుడు నిర్ణయాలంటూ మండిపాటు
World Cup centuries at the age of 23:
Rachin Ravindra – 2*.
Sachin Tendulkar – 2. pic.twitter.com/V5A76TNLv8
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023