వీడియో: హ్యాట్రిక్ తో ఫామ్ లోకి స్టార్క్.. టీమిండియాకి ఇది వేకప్ కాల్!

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం నోట ఒకటే మాట వినిపిస్తోంది.. వరల్డ్ కప్ 2023. ఈసారి కప్పు మా జట్టు కొడుతుందంటే.. మా జట్టు కొడుతుంది అంటూ నెట్టింట యుద్ధాలు కూడా చేస్తున్నారు. అయితే టీములు మాత్రం ప్రాక్టీస్, వార్మప్ మ్యాచ్ లు అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం రెండు వార్మప్ మ్యాచులు జరగాలి. కానీ, వర్షం కారణంగా గువహటిలో జరగాల్సిన టీమిండియా- ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ రద్దైంది. అలాగే నెథర్లాండ్స్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎలాంటి ఫలితం రాలేదు. ఆ మ్యాచ్ లో ఫలితం రాకపోయినా కూడా టీమిండియాకి మాత్రం ఒక వేకప్ కాల్ వచ్చింది.

శనివారం తిరువానంతపురం వేదికగా ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ని 23 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. స్మిత్(55), అలెక్స్ కేరీ(28), గ్రీన్(34), స్టార్క్(24)తో రాణించారు. 23 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 166 పరుగులు చేసింది. అయితే నెదర్లాండ్స్ లాంటి జట్టుపై.. బ్యాటింగ్ పరంగా ఆస్ట్రేలియా పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కానీ, నెదర్లాండ్స్ మాత్రం బౌలింగ్ లో తమ సత్తా చాటారు. వరల్డ్ క్లాస్ బ్లాటర్లను కూడా వెంటనె పెవిలియన్ చేర్చారు. అయితే ఈ మ్యాచ్ లో రిజల్ట్ రాకపోయినా కూడా ఆస్ట్రేలియాకి మంచి జరిగిందనే చెప్పాలి.

అదేంటంటే వారి బ్యాటింగ్ స్టామినా ఏంటో వాళ్లకి తెలిసింది. అలాగే వింటేజ్ స్టార్క్ ని మళ్లీ చూశారు. వరల్డ్ కప్ నేపథ్యంలో మిచెల్ స్టార్ భీకర ఫామ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంత ఈజీగా ఉండదు విషయాన్ని అన్నీ జట్లకు చేరవేసినట్లు అయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ నుంచి టీమిండియా చాలా నేర్చుకోవాలి. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచిన టీమిండియాకు ఇది వేకప్ కాల్ లాంటిది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచిమాని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఈ మ్యాచ్ ద్వారా తెలుసుకోవాలి. పైగా ఈ మ్యాచ్ లో వింటేజ్ స్టార్క్ ని చూసినట్లు అనిపించింది. కాబట్టి ముఖ్యంగా టీమిడింయా టాపార్డర్.. స్టార్క్ ని దృష్టిలో పెట్టుకుని యార్కర్, బౌన్సర్ ఆడటంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలంటూ నెటిజన్స్ సూచిస్తున్నారు.

ఇంక మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ విషయానికి వస్తే.. తొలి ఓవర్ 5వ బంతికి మ్యాక్స్ ని ఎల్బీ డబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికి వెస్లే బరేసీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో ఓవర్ తొలి బంతికి బస్ డే లీడేని క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా ఆఖరి రెండు వికెట్లు మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఒక్కో బాల్ బుల్లెట్ తరహాలో దూసుకుని వచ్చాయి. ఈ హ్యాట్రిక్ చూసిన తర్వాత టీమిండియాలో చాలా మంది కాస్త ఫుట్ వర్క్, ఎర్లీ షాట్లమీద దృష్టి సారించాలంటూ పెద్దఎత్తున సూచనలు వస్తున్నాయి. మరి.. మిచెల్ స్టార్క్ ఫామ్ లోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments