iDreamPost
android-app
ios-app

డబుల్ సెంచరీతో గెలిపించినా అసంతృప్తిలో మ్యాక్స్​వెల్.. అలా జరగాల్సిందంటూ..!

  • Author singhj Published - 09:52 AM, Wed - 8 November 23

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాక్సీ మాత్రం అసంతృప్తిలో కనిపించాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాక్సీ మాత్రం అసంతృప్తిలో కనిపించాడు.

  • Author singhj Published - 09:52 AM, Wed - 8 November 23
డబుల్ సెంచరీతో గెలిపించినా అసంతృప్తిలో మ్యాక్స్​వెల్.. అలా జరగాల్సిందంటూ..!

వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్​లు ఉన్నాయి. బ్యాట్​తో చెలరేగి సెంచరీల మోత మోగించినవి చాలానే ఉన్నాయి. కానీ ప్రపంచ కప్ చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్ ఏదని అడిగితే.. ఠక్కున గుర్తొచ్చేది భారత లెజెండ్ కపిల్ దేవ్​దే. 1983 వరల్డ్ కప్​లో జింబాబ్వేపై కపిల్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్​ను క్రికెట్ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోలేరు. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్​కు వచ్చాడు కపిల్. వారియర్​లా నిలబడి తన అద్భుతమైన బ్యాటింగ్​తో టీమ్​ను గెలిపించాడు. ఇదే జోష్​లో ఫైనల్​లో వెస్టిండీస్​ను ఓడించి భారత టీమ్ తొలిసారి వరల్డ్ కప్​ను ముద్దాడింది. కపిల్ దేవ్ ఇన్నింగ్స్ తర్వాత ఆ రేంజ్ ఇన్నింగ్స్ వరల్డ్ కప్​లో దాదాపుగా లేదనే చెప్పాలి. అయితే ఆ కొరతను తీర్చేలా మంగళవారం ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో గ్లెన్ మ్యాక్స్​వెల్ బ్యాటింగ్ చేశాడు.

కపిల్ దేవ్ స్థాయి కళాత్మక షాట్లు మ్యాక్సీ ఆడకపోయి ఉండొచ్చు. ఈ తరం నయా క్రికెటింగ్ షాట్లతో, తన భుజబలాన్ని ఉపయోగిస్తూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు మ్యాక్సీ. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 292 రన్స్ టార్గెట్​ ఛేజింగ్​లో 91 రన్స్​కే ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. కంగారూ టీమ్ మరో 40 పరుగులు చేసినా గొప్పే అని అంతా అనుకున్నారు. నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, ముజీబ్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు బౌలింగ్ వేస్తున్నారు. మరో 31 ఓవర్లలో 200 స్కోరు కొట్టాలి. కానీ మ్యాక్సీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. మొదట్లో మ్యాక్స్​వెల్ కాస్త తడబడ్డాడు. అతడు ఇచ్చిన కొన్ని క్యాచుల్ని ఆఫ్ఘాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. దీని నుంచి బయటపడిన మ్యాక్సీ తన మార్క్ గోల్ఫ్, స్కూప్, రివర్స్ స్వీప్ షాట్లు కొట్టాడు.

ఒక దశలో తీవ్ర అలసట, ఇంజ్యురీ కారణంగా బాడీని వంచలేకపోయాడు మ్యాక్స్​వెల్. అంత ఇబ్బందిలోనూ గ్యాప్స్ చూసి బౌండరీలు, చెత్త బంతుల్ని నేరుగా స్టాండ్స్​లోకి పంపాడు. ఒకవైపు మ్యాక్సీ భారీ షాట్లు ఆడుతుంటే మరోవైపు కమిన్స్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అండగా నిలిచాడు. ఎక్కడ షాట్ కొడతే ఔట్ అవుతానోననే భయంతో మ్యాక్సీకే బాధ్యతను అప్పజెప్పాడు. చకచకా ఏడు వికెట్లు తీసిన ఆఫ్ఘాన్ బౌలర్లకు మ్యాక్స్​వెల్ విధ్వంసాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. ఫీల్డర్లు ఈజీ క్యాచులు వదిలేయడం ఆఫ్ఘానిస్థాన్ టీమ్ కొంపముంచింది. ఈ విజయంతో ఆస్టేలియా ఎలాంటి ఈక్వేషన్స్​తో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్​కు దూసుకెళ్లింది. ఆసీస్ చేతిలో ఓడినా ఆఫ్ఘాన్​కు ఇంకా సెమీస్​ ఛాన్స్ ఉంది.

నెక్స్ట్ మ్యాచ్​లో సౌతాఫ్రికాపై ఆఫ్ఘానిస్థాన్ పక్కాగా గెలవాలి. అదే టైమ్​లో న్యూజిలాండ్, పాకిస్థాన్ టీమ్స్ విజయాలు, రన్​రేట్ మీద కూడా ఆఫ్ఘాన్ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆఫ్ఘాన్​తో మ్యాచ్​ తర్వాత మ్యాక్స్​వెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డబుల్ సెంచరీతో టీమ్​ను గెలిపించినా తనలో ఓ అసంతృప్తి ఉందన్నాడు. ‘నేను ఇవాళ చాలా లకీ. ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఇన్నింగ్స్ ఆడుంటే ఇంకా హ్యాపీగా ఫీలయ్యేవాడ్ని. కానీ నేను ఆడిన నాక్ మీద గర్వంగా ఉంది’ అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో కొన్ని క్యాచ్​లు ఇచ్చాడతను. అయితే ఆఫ్ఘాన్ ఫీల్డర్లు వాటిని వదిలేయడంతో బతికిపోయాడు. దీని గురించే మ్యాచ్ తర్వాత ప్రస్తావించాడు. మరి.. మ్యాక్స్​వెల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడుతున్న శ్రీలంక.. సెహ్వాగ్‌కు చేసిన ద్రోహం మర్చిపోయారా?