iDreamPost
android-app
ios-app

BCCIకి ఊహించని లాభం.. 5 వేల కోట్లకు పైనే అదనపు ఆదాయం!

  • Published Aug 20, 2024 | 4:14 PM Updated Updated Aug 20, 2024 | 4:14 PM

వరల్డ్ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. మన దేశ బోర్డు మీద వద్దన్నా కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. మరో రూ.5 వేల కోట్లు అదనంగా బీసీసీఐ ఖజానాలో చేరాయి.

వరల్డ్ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. మన దేశ బోర్డు మీద వద్దన్నా కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. మరో రూ.5 వేల కోట్లు అదనంగా బీసీసీఐ ఖజానాలో చేరాయి.

  • Published Aug 20, 2024 | 4:14 PMUpdated Aug 20, 2024 | 4:14 PM
BCCIకి ఊహించని లాభం.. 5 వేల కోట్లకు పైనే అదనపు ఆదాయం!

వరల్డ్ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే మ్యాచుల ద్వారా భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్న భారత క్రికెట్ బోర్డు.. ఎక్కువ మటుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీదే ఆధారపడుతోంది. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా బీసీసీఐ ఖాతాలో వేల కోట్లు వచ్చి పడుతున్నాయి. నెలన్నర పాటు జరిగే ఈ టోర్నమెంట్​ బంగారు గుడ్లు పెట్టే పక్షిలా మారింది. మరోసారి ఈ టోర్నీ వల్ల బీసీసీఐకి జాక్​పాట్ తగిలింది. ఏకంగా రూ.5,000 కోట్ల అదనపు ఆదాయం బోర్డు అకౌంట్​లో జమ అయింది. ఏ ఐపీఎల్ ఎడిషన్ ద్వారా ఇంత లాభం వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఐపీఎల్-2023 ఎడిషన్ మిగులు సంపాదనలో ఏకంగా 116 శాతం పెరుగుదల కనిపించిందని సమాచారం. ఐపీఎల్-2022తో రూ.2,367 కోట్లు మిగులు ఆదాయం బీసీసీఐ ఖజానాలో చేరగా.. ఆ తర్వాతి ఏడాది రూ.5,120 కోట్లకు చేరిందని తెలుస్తోంది. ఐపీఎల్-2023 ఎడిషన్​తో ఏకంగా రూ.11,769 కోట్ల ఆదాయం బోర్డు అకౌంట్​లో చేరిందని వినిపిస్తోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 78 శాతం ఎక్కువ కావడం విశేషం. అయితే బోర్డు పెడుతున్న ఖర్చులు కూడా పెరిగాయి. ఖర్చులు 66 శాతం రూ.6,648 కోట్లకు చేరిందని క్రికెట్ వర్గాల సమాచారం. ఐపీఎల్ వల్ల వద్దన్నా మన దేశ క్రికెట్ బోర్డు మీద కాసుల వర్షం కురుస్తూనే ఉందనడానికి ఇదే ఎగ్జాంపుల్ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

ఐపీఎల్ ఆదాయం ఒకేసారి ఇంతలా పెరగడానికి మీడియా రైట్స్, స్పాన్సర్​షిప్ రైట్స్ కారణమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఒప్పందాల వల్లే భారీ మిగులు కనిపిస్తోందని, ఇది బోర్డుకు ఎంతో మంచి చేసిందని చెబుతున్నాయి. 2023-27 సీజన్ కోసం మీడియా రైట్స్​ ద్వారా బోర్డు ఖాతాలో ఏకంగా రూ.48,390 కోట్లు వచ్చి చేరాయి. ఇందులో ఐపీఎల్ టెలివిజన్ రైట్స్ ద్వారా రూ.23,575 కోట్లు, డిజిటల్ ప్లాట్​ఫామ్ ద్వారా మరో రూ.23,758 కోట్లు దక్కాయి. క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ స్పాన్సర్ హక్కుల కింద ఇంకో రూ.2,500 కోట్లు వచ్చి పడ్డాయి. ఇక, ఈ ఏడాది ఆఖర్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈలోపే ప్లేయర్ల రిటెన్షన్​ పై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. గత నెలలో ఫ్రాంచైజీలతో ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చేందుకు బోర్డు మీటింగ్ పెట్టింది. కానీ ఇంతవరకు రైట్ టు మ్యాచ్ రూల్​పై ఏదీ చెప్పలేదు. ఈ విషయంలో బోర్డు ఏం చేస్తుందో చూడాలి.