Nidhan
డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వన్డేలకూ అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కొత్త ఓపెనర్ కోసం అన్వేషిస్తున్న ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వన్డేలకూ అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కొత్త ఓపెనర్ కోసం అన్వేషిస్తున్న ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
Nidhan
క్రికెట్లో ఓపెనర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ ఫార్మాట్ అయినా సరే గెలుపోటముల్లో వీళ్లదే ప్రధాన పాత్ర. మంచి పార్ట్నర్షిప్స్ అందించే ఓపెనర్లు ఉంటే విజయాలు అలవోకగా వస్తాయి. అయితే ఓపెనింగ్ పొజిషన్‌కు ఫేమ్ తెచ్చిన కొందరు క్రికెటర్లు ఉన్నారు. వారిలో ఒకడు డేవిడ్ వార్నర్. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు బాదుడే మంత్రంగా బౌలర్లపై విరుచుకుపడటంలో అతను సిద్ధహస్తుడు. అపోజిషన్ బౌలర్ల రిథమ్‌ను దెబ్బతీసి మానసికంగా పైచేయి సాధించడం డేవిడ్ భాయ్ స్ట్రాటజీ. దశాబ్ద కాలం పాటు తన అద్భుత ప్రదర్శనలతో ఆసీస్‌కు ఎన్నో విక్టరీలు అందించిన వార్నర్ రీసెంట్గా టెస్టులు, వన్డేలకు గుడ్‌బై చెప్పేశాడు. టీ20ల్లో మాత్రం కంటిన్యూ అవుతానని తెలిపాడు. దీంతో కొత్త ఓపెనర్ వేటలో పడింది కంగారూ టీమ్. వార్నర్ లాంటి మరో ఓపెనర్ ఎక్కడ దొరుకుతాడా అని వెతకసాగింది. అయితే టీమ్‌లోనే ఉన్న ఓ 34 ఏళ్ల సీనియర్ ప్లేయర్‌ను ఆ పొజిషన్‌కు సెలక్ట్ చేసింది.
వార్నర్ ప్లేస్‌లో కొత్త ఓపెనర్ కోసం జల్లెడ పడుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. డేవిడ్ భాయ్‌కు రీప్లేస్‌మెంట్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేసింది. ఇక మీదట టెస్టుల్లో కంగారూల తరఫున స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఒకప్పుడు 8వ నంబర్లో బ్యాటింగ్‌కు దిగే స్మిత్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం దొరకడం గొప్ప విషయమనే చెప్పాలి. అది కూడా ఎంతో ఒత్తిడి ఉండే టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఛాన్స్ దక్కడాన్ని ప్రశంసించకుండా ఉండలేం. అయితే ఇందులో లక్ కంటే స్మిత్ పడిన కష్టానికి ప్రతిఫలమం దక్కిందని చెప్పొచ్చు. అవును, ఒకప్పుడు అతడు అనామకుడిగా ఉండేవాడు. స్మిత్ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టేవారు కాదు. ఇంటర్నేషనల్ కెరీర్‌ను లెగ్ స్పిన్నర్‌గా స్టార్ట్ చేశాడతను. ఆ టైమ్‌లో ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. కానీ తక్కువ సమయంలోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బౌలింగ్ కంటే స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న తీరు టీమ్ మేనేజ్మెంట్ను అట్రాక్ట్ చేసింది.
డిఫరెంట్ ఫుట్‌వర్క్‌తో, ప్రత్యేకమైన శైలితో స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంది. మంచి బంతుల్ని డిఫెన్స్ చేస్తూ, లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ చివర్లో విలువైన రన్స్ జోడించడంతో అతడికి ప్రమోషన్ లభించింది. కంటిన్యూస్‌గా బ్యాట్‌తో పెర్ఫార్మ్ చేస్తుండటంతో టాపార్డర్‌లో అతడికి చోటు దక్కింది. దీంతో బౌలింగ్‌ను పక్కన పెట్టి పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్ అవతారం ఎత్తాడు స్మిత్. జట్టు అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేస్తుంటాడు. ఇప్పుడు వార్నర్ టీమ్‌ను వీడటంతో ఆ పొజిషన్లో ఆడే మరో ప్లేయర్ కనిపించకపోవడం, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉండటం, అనుభవమూ తోడవడంతో స్మిత్‌ను ఓపెనర్‌గా నియమించింది ఆసీస్. ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఆసీస్ జట్టులో ఓపెనింగ్ పొజిషన్‌కు స్మిత్‌ను మించినోడు లేడని అంటున్నారు. మరి.. స్మిత్ ఓపెనింగ్ పొజిషన్‌కు న్యాయం చేయగలడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ఆ తప్పు కారణంగా ఇషాన్ ను జట్టు నుంచి తీసేసిన BCCI?
Steve Smith, started his career as number 8, bowling leg spin then backbone of Australian batting & now as a Test opener at the age of 34.
– What a great journey, The best Test batter in modern Era. 🫡 pic.twitter.com/fwbbJ3qtIy
— Johns. (@CricCrazyJohns) January 10, 2024